గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bigg Boss 5 : మీ ఇద్ద‌రూ నన్ను ఎద‌వ‌ను చేసి ఆడుకున్నారు.. అంటూ ష‌ణ్ముఖ్ ఆవేద‌న‌..

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లో త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్న‌ష‌ణ్ముఖ్‌, జ‌స్వంత్‌, సిరి మొన్న‌టి వ‌ర‌కు క‌లిసిక‌ట్టుగా ఆడారు. అయితే జెస్సీకి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ని జ‌స్వంత్ స‌రిగా అర్ధం చేసుకోకుండా ఆడాడు.…

Bigg Boss 5 : మీ ఇద్ద‌రూ నన్ను ఎద‌వ‌ను చేసి ఆడుకున్నారు.. అంటూ ష‌ణ్ముఖ్ ఆవేద‌న‌..

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లో త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్న‌ష‌ణ్ముఖ్‌, జ‌స్వంత్‌, సిరి మొన్న‌టి వ‌ర‌కు క‌లిసిక‌ట్టుగా ఆడారు. అయితే జెస్సీకి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ని జ‌స్వంత్ స‌రిగా అర్ధం చేసుకోకుండా ఆడాడు. దీంతో జెస్సి కెప్టెన్సీ టాస్క్ లో నేరుగా ఎంపికయ్యే అవకాశం కోల్పోయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. దీంతో ష‌ణ్ముఖ్‌లో ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంది.

Bigg Boss 5  shanmukh is very sad he told he is unfit for the game

సీక్రెట్‌ టాస్క్‌లో జెస్సీకి సిరి సాయం చేయడాన్ని షణ్ముఖ్ జీర్ణించుకోలేకపోయాడు. ఫ్రెండ్ అనుకుని నన్ను ఎదవను చేశారు.. నేను దేనికి పనికి రాను.. ఆట ఆడటం రాదు అని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు.. ఇంట్లో అందరూ అలాగే చూస్తున్నారు. బయటకు వెళ్లాక కూడా అందరూ అదే అంటారు.. అని షణ్ణ్నూ తెగ ఫీలయ్యాడు. అందరూ టాస్క్‌ సరిగ్గా ఆడడని అంటున్నారని, తనను అందరూ పిచ్చ లైట్‌ తీసుకుంటున్నారని జెస్సీ, సిరిల ముందు షణ్ముఖ్‌ వాపోయాడు.

జెస్సీ కెప్టెన్ అయ్యేందుకు నువ్వు సాయం చేశావు. నేను మోస‌పోయాను. నాకు గేమ్ ఆడ‌డం రాక‌పోవ‌డం నా ద‌రిద్రం.. అంటూ ష‌ణ్ముఖ్ త‌న బాధ‌ను తెలియ‌జేశాడు. అయితే దీనిపై సిరి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఇక్క‌డ నుండి వెళ్లిపో అంటూ ఆమెపై ఫైర్ అయ్యాడు ష‌ణ్ముఖ్‌. ఈ క్ర‌మంలో ష‌ణ్ముఖ్‌, సిరి ఇద్ద‌రూ ఏడ్చారు. క‌లిసిక‌ట్టుగా ఉన్న ముగ్గురి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ ను క‌లిగించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి