గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bigg Boss 5 : బిగ్‌బాస్‌ హౌస్‌.. ఎమోషనల్ అయిన షణ్ముఖ్..

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా పవర్ రూమ్ లోకి వెళ్లిన సిరి, అనీ మాస్టర్ కి షన్ను, కాజల్ లేఖలు అందాయి. ఈ క్రమంలోనే ఇందులో ఒకరు లెటర్…

Bigg Boss 5 : బిగ్‌బాస్‌ హౌస్‌.. ఎమోషనల్ అయిన షణ్ముఖ్..

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా పవర్ రూమ్ లోకి వెళ్లిన సిరి, అనీ మాస్టర్ కి షన్ను, కాజల్ లేఖలు అందాయి. ఈ క్రమంలోనే ఇందులో ఒకరు లెటర్ వదులుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే కాజల్ కి తన భర్త నుంచి లెటర్ వచ్చి ఉంటుందని భావించిన షణ్ముఖ్ తన లెటర్ ను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇక తన లెటర్ ను ముక్కలు చేయబోతుండగా సిరి అడ్డుపడింది.

Bigg Boss 5 shanmukh got emotional in house

నేను నా లెటర్ ను వదులుకున్నాను.. కనీసం నువ్వైనా నీ లెటర్ అందుకో అంటూ సిరికి చెప్పి షణ్ముఖ తన లెటర్ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ లెటర్ ను ముక్కలు చేసి ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా షణ్ముఖ్ మాట్లాడుతూ అమ్మ.. నువ్వు క్యాన్సర్ నుంచి బయట పడ్డావు. అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి తొందరగా కోలుకున్నారు.

ఇప్పుడు నేను కూడా నిన్ను ఇన్‌స్పిరేషన్ గా తీసుకొని ఈ బాధ నుంచి బయట పడతాను.. అంటూ షణ్ముఖ్ ఎమోషనల్ అయ్యాడు. ఇలా హౌస్ సభ్యులందరికీ లెటర్లు రాగా కేవలం సన్నీ కెప్టెన్ కావడంతో అతనికి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. లెటర్ రాని జెస్సిని నామినేట్ చేయాలనుకుంటే అతని లెటర్ ను ముక్కలు చేసి నామినేట్ చేయవచ్చు. సేవ్ చేయాలి అనుకుంటే తన లెటర్ తనకు ఇవ్వొచ్చు.. అంటూ బిగ్ బాస్ సన్నీకి స్పెషల్ పవర్ ఇచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి