Bigg Boss 5 : ఆప్ష‌న్స్ లేక‌పోతే వేసేస్తావా ? ష‌ణ్ముఖ్‌పై ప్రియాంక ఫైర్‌..!

November 8, 2021 11:28 PM

Bigg Boss 5 : బుల్లితెరపై ఎన్ని షోలు, సీరియ‌ల్స్ న‌డుస్తున్నా.. బిగ్‌బాస్ ప్ర‌త్యేక‌తే వేరు. ఈ సీజ‌న్‌లో కంటెస్టెంట్లు అంద‌రూ మ‌రీ స్ట్రాంగ్‌గా ఉన్నారు. దీంతో షో ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. అయితే సోమ‌వారం నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశం చోటు చేసుకుంది.

Bigg Boss 5 priyanka singh fire on shanmukh

నామినేష‌న్స్‌లో భాగంగా ఒక్కో కంటెస్టెంట్ ఇద్ద‌రిని నామినేట్ చేయాలి. త‌రువాత వారు జైలులో ఉంటారు. అనంత‌రం వారిని సేవ్ చేసి బ‌య‌ట‌కు తీసుకురావాలి. ఇక చివ‌రి వ‌ర‌కు జైలులో ఉన్న‌వారు నామినేట్ అవుతారు. ఈ క్ర‌మంలోనే సిరి, రవి, సన్నీ, మానస్, కాజల్ లు ఈ వారం నామినేట్ అయ్యారు.

అయితే నామినేష‌న్స్‌లో భాగంగా జైలులోకి వెళ్లి వ‌చ్చిన ష‌ణ్ముఖ్ ప్రియాంక‌ను నామినేట్ చేశాడు. అందుకు కార‌ణం చెప్ప‌మ‌ని అడిగితే.. తాను కెప్టెన్‌గా ఉన్న‌ప్పుడు పింకీ మైక్ విష‌యంలో స‌తాయించింద‌ని చెప్పాడు. అందుక‌నే త‌న‌ను నామినేట్ చేస్తున్నాన‌ని అన్నాడు. అయితే ఆ రీజ‌న్ స‌రిగ్గా లేద‌ని ప్రియాంక వాదించింది.

త‌న‌కు ఇంకొకరిని నామినేట్ చేసే ఆప్ష‌న్ లేద‌ని, క‌నుక ప్రియాంక‌ను నామినేట్ చేయ‌క త‌ప్ప‌డం లేద‌ని ష‌ణ్ముఖ్ అన్నాడు. దీంతో ప్రియాంక మ‌రింత రెచ్చిపోయింది. నీకు ఆప్ష‌న్స్ లేక‌పోతే న‌న్ను వేసేస్తావా ? అని ప్ర‌శ్నించింది. అది సిల్లీ రీజ‌న్ అని ఆమె అన‌గా, తాను ఇంతేన‌ని, ఇలాగే గేమ్ ఆడుతాన‌ని ష‌ణ్ణు చెప్పాడు.

దీంతో ఆగ్ర‌హించిన ప్రియాంక మ‌ళ్లీ సెటైర్ వేసింది. నువ్వు క‌రెక్ట్ కాదు, నువ్వు న‌న్ను టార్గెట్ చేశావు, ఐయామ్ రెడీ.. అని ప్రియాంక జైలులోకి వెళ్లిపోయింది. ఇక ఈ వారం నామినేష‌న్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉండ‌డంతో.. ఎవ‌రు ఎలిమినేట్ అవుతారోన‌ని ఆస‌క్తి నెల‌కొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment