గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bigg Boss 5 : అంద‌రి ముందే మాన‌స్‌కి ముద్దులు పెట్టిన ప్రియాంక‌..!

Bigg Boss 5 : మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌లో అంద‌రు ఇంటి స‌భ్యులు నామినేషన్స్‌లో జరిగిన ఇష్యూపై చ‌ర్చించుకుంటుంటే, ప్రియాంక మాత్రం మానస్ సేవలో తరించిపోవడానికే తపించిపోయిన‌ట్టుగా క‌నిపించింది. ప‌దే ప‌దే మాన‌స్ వెనుక తిరుగుతుండ‌డం ఆయ‌న‌కు చిరాకు…

Bigg Boss 5 : అంద‌రి ముందే మాన‌స్‌కి ముద్దులు పెట్టిన ప్రియాంక‌..!

Bigg Boss 5 : మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌లో అంద‌రు ఇంటి స‌భ్యులు నామినేషన్స్‌లో జరిగిన ఇష్యూపై చ‌ర్చించుకుంటుంటే, ప్రియాంక మాత్రం మానస్ సేవలో తరించిపోవడానికే తపించిపోయిన‌ట్టుగా క‌నిపించింది. ప‌దే ప‌దే మాన‌స్ వెనుక తిరుగుతుండ‌డం ఆయ‌న‌కు చిరాకు తెప్పించింది. అన్నం పెట్ట‌నా మాన‌స్ అని ప్రియాంక అంటే, దానికి మాన‌స్.. నాకు కావాల్సింది నేను పెట్టుకుంటా.. నువ్ పెట్టాల్సిన పనిలేదని చెప్పాడు.

Bigg Boss 5 priyanka kissed manas before all house mates

మ‌ళ్లీ మానస్ దగ్గరకు వచ్చి ఏమైనా కావాలా మానస్.. పెరుగు అన్నం తీసుకుని రానా? అని అడిగింది ప్రియాంక. వద్దు అని చెప్పాడు మానస్. కొంచెం తిను మానస్.. అని ప్రియాంక అడగడంతో మానస్‌కి చిర్రెత్తుకొచ్చింది. నాకు కావాలనిపిస్తే నేను పెట్టుకుంటా.. అని చెప్పాడు. దీంతో.. నేను ఏమైనా మిస్టేక్ చేశానా ? అని ప్రియాంక అడగడంతో.. తింటున్నా.. తరువాత మాట్లాడతా.. అని చెప్పాడు మానస్.

ఏదో విష‌యంలో కోపంతో ర‌గిలిపోతున్న‌మాన‌స్‌ని తన ముద్దుల‌తో క‌రిగించేసింది ప్రియాంక‌. భోజనం ప్లేటు పట్టుకుని ముద్దు కావాలా ? ముద్ద కావాలా ? అని అడిగితే మానస్‌ ముద్దే కావాలన్నాడు. దీంతో ప్రియాంక దొరికిందే ఛాన్స్‌ అనుకుని ముద్దుల మీద ముద్దులిచ్చింది. ఇది చూసిన వారు ప్రియాంక‌.. బిగ్ బాస్ గేమ్ ఆడ‌డానికి వ‌చ్చిందా, లేదా మాన‌స్ సేవ‌లో త‌రించిపోడానికి వ‌చ్చిందా.. అని తిడుతున్నారు. కాజ‌ల్ కూడా ఓ సంద‌ర్బంలో ప్రియాంక‌కి చుర‌కలు అంటించింది.

మానస్ తనతో మాట్లాడటం లేదని కాజల్ దగ్గర తెగ ఫీల్ అయిపోయింది ప్రియాంక‌. దీంతో.. అసలు నువ్ మానస్ కోసమే వచ్చావా ? బిగ్ బాస్‌కి .. వెయిట్ చేయి మాట్లాడతాడులే.. ఎవరూ ఎవరికోసం రాలేదు.. ఇదే గేమ్.. గేమ్‌లాగే ఆడు’ అని చురకలేసింది కాజల్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి