గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bigg Boss 5 : బాబోయ్‌.. అంద‌రూ చూస్తుండ‌గానే ప్రియాంక‌కి అలా ముద్దు పెట్టేశాడేంటి ?

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లో హౌజ్‌మేట్స్ మ‌ధ్య ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. కొట్లాట‌లు, గొడ‌వ‌లు, ప్రేమ‌లు.. ఇలా ఒక‌టేంటి ఎన్నో ఎమోష‌న్స్ క‌నిపిస్తున్నాయి. అయితే హౌస్‌లో కెప్టెన్సీ కంటెండ‌ర్ టాస్క్‌…

Bigg Boss 5 : బాబోయ్‌.. అంద‌రూ చూస్తుండ‌గానే ప్రియాంక‌కి అలా ముద్దు పెట్టేశాడేంటి ?

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లో హౌజ్‌మేట్స్ మ‌ధ్య ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. కొట్లాట‌లు, గొడ‌వ‌లు, ప్రేమ‌లు.. ఇలా ఒక‌టేంటి ఎన్నో ఎమోష‌న్స్ క‌నిపిస్తున్నాయి. అయితే హౌస్‌లో కెప్టెన్సీ కంటెండ‌ర్ టాస్క్‌ సుదీర్ఘంగా సాగ‌గా, ‘సూపర్‌ హీరోస్‌ vs సూపర్‌ విలన్స్‌’ పోటీలో తమ జట్టును గెలిపించుకునేందుకు హౌస్‌మేట్స్‌ అందరూ బాగా కష్టపడ్డారు.

Bigg Boss 5 jessy kissed priaynka everybody surprised

మెరుపు శ‌క్తిని ద‌క్కించుకొని సూప‌ర్ విల‌న్స్ జ‌ట్టు సంబ‌రాల‌లో మునిగిపోగా, ఆ టీం స‌భ్యుడు జెస్సీని ప్రియాంక అభినందించగా అతడేమో ముద్దు పెట్టాడు. దీంతో ప్రియాంక అవాక్కైంది. జెస్సీ ఒక్కసారిగా తనని ముద్దాడే సరికి షాక్ అయ్యింది ప్రియాంక. ఆమెను చూసి శ్రీరామ్ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. ఏంటీ ముద్దు పెట్టేశాడా? అని సన్నీ అడగ్గా.. ‘ఛీ.. నేను ఎందుకు పెడతాను.. వాడే పెట్టాడు.. కంగ్రాట్స్ అని కిందికి వంగాను.. ఫటక్‌ అని ముద్దు పెట్టేశాడు’ అని చెప్పి తెగ మురిసిపోయింది.

జ‌శ్వంత్ ముద్దు పెట్టాడ‌ని ఆమెకు కోపం ఏమాత్రంలేదు. నోటికి చేయి అడ్డు పెట్టుకొని కాసేపు హ‌డావిడి చేసింది. మ‌రోవైపు తాను మాన‌స్ ప్రేమ‌లో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. మాన‌స్ కూడా త‌న‌ను ఇష్ట‌ప‌డుతున్నాడంటూ పేర్కొంది. ఇదే విష‌యాన్ని సిరితో కూడా డిస్క‌స్ చేసింది. చూస్తుంటే ఏదో రోజు వీరు స‌ర్‌ప్రైజింగ్ న్యూస్ చెప్ప‌బోతున్నార‌ని అర్ధ‌మ‌వుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి