Bigg Boss 5 : అంద‌రికి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకిన జెస్సీ.. సిరికి మాత్రం ముద్దులు ఇచ్చేశాడు..!

November 15, 2021 3:32 PM

Bigg Boss 5 : అనూహ్య ప‌రిణామాల న‌డుమ బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన జ‌స్వంత్ కంటెస్టంట్స్ కి ల్యాండ్ ఫోన్ ద్వారా విలువైన స‌లహాలు, సూచ‌న‌లు చేశాడు. ముందుగా స‌న్నీని పిలిచి.. టంగ్ కంట్రోల్‌లో పెట్టుకో. గేమ్ ను వ్యక్తిగతంగా ఆడు. మిగ‌తా అంతా బాగుంది అని చెప్పాడు. అనంత‌రం మాన‌స్‌తో మాట్లాడుతూ.. ‘నువ్వు సైలెంట్ కిల్ల‌ర్‌. ర‌వికే బాబువి నువ్వు, ఒప్పుకోవు, కానీ ఇదే నిజం. నీ ఐడియాస్ బాగున్నాయ్ కానీ అంద‌రినీ నెగెటివ్‌గా చూడ‌కు’ అని సూచించాడు.

Bigg Boss 5 jessy given left and right to house mates

కాజల్‌తో మాట్లాడుతూ.. నవ్వకు.. నిన్ను తిట్టాలని ఉంది.. ఈ వారం రోజులు నిన్ను చూశాను.. ఎలా ఆడుతున్నావ్.. మొదట్లో ఉన్నట్టు ఉండు.. నీ ఐడియాతో నువ్ ఆడుకో.. గ్రూప్ కోసం ఆడకు.. నీ ఫ్రెండ్స్ నీకేం వాల్యూ ఇవ్వడం లేదు.. నిన్ను వాడుకుంటున్నారు.. తిట్టుకుంటున్నారు.. అది తెలుసుకో.. అని కనువిప్పు కలిగించాడు. అనీ మాస్ట‌ర్‌ గేమ్ బాగుంద‌న్న జెస్సీ.. ప్రియాంక సింగ్‌ను త్యాగాలు ఆపేయ‌మ‌ని హిత‌వు ప‌లికాడు.

‘త‌ర్వాత సీజ‌న్‌లో వ‌చ్చేవాళ్లు నిన్ను చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి, అంతేకానీ అబ్బో, అది 10 వారాలు ఎలా ఉంది ? అని చుల‌క‌న‌చేయొద్దు’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. శ్రీరామ్ టాప్ 5లో ఉంటాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ర‌వితో ఫోన్‌లో ముచ్చ‌టిస్తూ.. ఇన్‌ఫ్లూయెన్స్ చేసినా కానీ నీ గేమ్ బాగుంటుంది. ఫైన‌ల్‌లో క‌లుస్తాన‌ని చెప్పాడు.

త‌ర్వాత సిరితో మాట్లాడుతూనే తిట్టుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఒక ప‌క్క తంతానంటూనే మ‌రోప‌క్క నీ ఫైటింగ్ బాగుంద‌ని మెచ్చుకున్నాడు. త‌ర్వాత‌ కిస్సులు లేవా ? అని అడ‌డ‌గ‌డంతో గాల్లోనే ముద్దులు పంపింది సిరి. చివ‌ర్లో వ‌చ్చేవారమే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌కు, ఫైన‌ల్‌దాకా అక్క‌డే ఉండ‌మ‌ని చెప్పాడు. చివరిగా ష‌ణ్ముఖ్‌తో మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ అయిపోయాడు జెస్సీ. ‘హౌస్‌లో ఉన్న చివ‌రి రోజుల్లో నీతో ఉండ‌లేక‌పోయాన‌న్న‌దే నా బాధ. నేను ఎప్ప‌టికీ నీ సీక్రెట్ ఫ్రెండ్‌నే’ అన్నాడు.

నువ్వు వెళుతూ మ‌రొక‌రికి లైఫ్ ఇచ్చినందుకు ప్రౌడ్‌గా ఉందంటూ ష‌ణ్ను జెస్సీని పొగిడాడు. బయటకు వచ్చాక కలుద్దామని జెస్సీ అంటే.. నాతోనే ఉండాలి అని జెస్సీతో షన్ను అంటాడు.. నీతోనే ఉంటాను అని జెస్సీ అంటాడు.. వీరిద్దరి సంభాషణ విని విసుగొచ్చిన నాగ్ ఇక ఆపేయండి.. బాయ్ ఫ్రెండ్.. గర్ల్ ఫ్రెండ్‌లా మాట్లాడుకుంటున్నారు.. అని కౌంటర్ వేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment