Bigg Boss 5 : త‌ను పోతూ మ‌రొక‌రిని కాపాడాడు.. హీ ఈజ్ ఫైట‌ర్ అన్న హౌజ్‌మేట్స్..

November 15, 2021 3:24 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం మ‌స్త్ రంజుగా సాగుతోంది. మొత్తానికి బిగ్ బాస్ 10వారాలు పూర్తి కాగా, 10 మంది కంటెస్టెంట్స్ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. అయితే ప‌దో వారం ఎలిమినేష‌న్ కాస్త ట్విస్ట్‌ల‌తో సాగింది. అనారోగ్యం వ‌ల‌న నామినేష‌న్‌లో కూడా లేని జ‌స్వంత్‌ని బ‌య‌ట‌కు పంపించారు. దాంతో ఒక‌రికి లైఫ్ దొరికిప‌నట్టైంది. జ‌స్వంత్ వెళ్ల‌క‌పోతే ఈ వారం కాజ‌ల్ ప‌క్కా ఎలిమినేట్ అయ్యేది.

Bigg Boss 5  jaswanth saved even if he was eliminated

సండే రోజు షోని ఫుల్ ఫ‌న్‌గా మార్చారు నాగార్జున . ముందుగా గంగవ్వ కట్టుకున్న కొత్తింటి గురించి కంటెస్టెంట్లకు చూపించారు. అంతే కాకుండా గంగవ్వ ఇంటికి సంబంధించిన విజువల్స్‌ను కూడా వేశారు. బిగ్ బాస్ వ‌ల‌న మ‌న క‌ల‌లు నిజం అవుతాయ‌ని తెలిపారు. చిల్డ్ర‌న్స్ డే సంద‌ర్భంగా చిన్నతనంలో ఆడుకున్న ఆటలు, ఓడిపోయిన కంటెస్టెంట్లకు స్కూల్‌లో విధించిన శిక్షలు వేశారు.

హౌజ్‌మేట్స్‌ని రెండు టీంలుగా విడ‌గొట్టిన నాగార్జున సెక్షన్ ఏ అంటూ షన్ను, అనీ, ప్రియాంక, సన్నీని ఒక టీంలో ఉంచారు. మిగతా వాళ్లను సెక్షన్ బీలో వేశారు. ఇక మానస్ సంచాలక్‌గా వ్యవహరించాడు. ఐస్, వాటర్, ఫైర్ అంటూ గార్డెన్ ఏరియాలో ఆటలు ఆడించారు. కంటెస్టెంట్లందరూ కూడా పాటలకు డ్యాన్సులు వేస్తుంటారు. పాటలు ఆగినప్పుడు ఐస్, వాటర్, ఫైర్‌లోంచి నాగ్ ఏదో ఒకటి చెబుతాడు. ఎవ‌రు చివ‌ర‌గా వెళ‌తారో వారు ఔట్ అయిన‌ట్టు.

గేమ్ ఇంట్రెస్టింగ్‌గా సాగ‌గా, ముందుగా శ్రీరామ్ ఔట‌య్యాడు. దీంతో అత‌నికి నోటి మీద వేలు వేసుకుని కూర్చోమని శిక్ష విధించారు. త‌ర్వాత ఓడిన ప్రియాంకను బెంచ్ మీద నిల్చొమన్నారు. రవిని గోడ కుర్చీ, షన్నుని మోకాళ్ల మీద, సిరిని ఒంటికాలి మీద, అనీని చేతులు పైకెత్తి నిల్చోమన్నారు. ఆ తరువాత అవుట్ అయిన కాజల్‌ను గార్డెన్ ఏరియాలో రౌండ్లు కొట్టించారు. చివరకు సన్నీ విన్ అవ్వడంతో సెక్షన్ ఏకు ఒక్క పాయింట్ వచ్చింది.

హీరో, హీరోయిన్స్ చిన్న‌ప్ప‌టి ఫొటోలు చూపించారు నాగార్జున‌. ఇందులో కాజల్, కీర్తి సురేష్ ఫోటోలను గుర్తు పట్టలేకపోయారు. అనీ, శ్రీరామచంద్రలు అయితే పవన్ కళ్యాణ్ ఫోటోను గుర్తు పట్టలేకపోయారు. ఈ టాస్కులోనూ సెక్షన్ ఏ గెలిచింది. ఆ తరువాత నాగార్జున మరో ఆట ఆడించారు. మెడలో మెడల్స్ అంటూ ఒక్కొక్కరికి ఒక్కో ట్యాగ్ ఇప్పించారు నాగ్. ఇందులో త‌మ ఒపీనియ్స్ తెలియ‌జేస్తూ ట్యాగులు వేశారు.

చివ‌రికి నామినేష‌న్‌లో మాన‌స్, కాజ‌ల్ ఉండ‌గా వారిద్ద‌రూ గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్సుల‌లో చేతులు పెట్ట‌గా ప‌సుపు రంగు వ‌చ్చింది. దీంతో ఈ వారం మీరు ఎలిమినేట్ కావడం లేదు. జ‌స్వంత్ ఎలిమినేట్ అవుత‌న్నాడ‌ని అన్నారు. అనారోగ్యం కార‌ణంగా అత‌ను ఎలిమినేట్ కావ‌లసి వ‌చ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment