Bigg Boss 5 : 11 వారాలు బిగ్‌బాస్ హౌస్ లో ఉన్న అనీ మాస్ట‌ర్‌కు ఎంత మొత్తం ఇచ్చారో తెలుసా ?

November 22, 2021 9:55 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ తెలుగు 5వ సీజ‌న్ మ‌హా జోరుగా కొన‌సాగుతోంది. సీజ‌న్ ముగింపున‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ సీజ‌న్‌లో విజేత ఎవ‌రు అవుతారు.. అంటూ అప్పుడే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. ఇక 11వ వారం ఇంటి నుంచి అనీ మాస్ట‌ర్ బ‌య‌ట‌కు వెళ్లారు. ఈమె టాప్ 5 నిలుస్తారా.. అన్న సందేహాలు వచ్చాయి. కానీ ఆమె గ‌త వారం త‌న ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగానే ఎలిమినేట్ అయిన‌ట్లు తెలుస్తోంది.

Bigg Boss 5  do you know how much anee master got for 11 weeks

ఇక 11 వారాల‌కు గాను అనీ మాస్ట‌ర్‌కు ల‌భించిన మొత్తం ఎంతో తెలుసుకునేందుకు నెటిజ‌న్లు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు ల‌భించిన మొత్తంపై ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆమె సెల‌బ్రిటీ క‌నుక వారానికి రూ.3 ల‌క్ష‌లు ఇచ్చార‌ని.. ఈ క్ర‌మంలో మొత్తం 11 వారాల‌కు రూ.33 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆమె అందుకున్నార‌ని తెలుస్తోంది.

కాగా అనీ మాస్ట‌ర్ ఎలిమినేష‌న్ త‌రువాత ఇంట్లో ఇంకో కంటెస్టెంట్‌ను బ‌య‌ట‌కు పంపేందుకు నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. ఈ వారంలో కాజ‌ల్ ఎలిమినేట్ అవుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే గ‌త వారం ఆమె ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కానీ అనారోగ్యం కార‌ణంగా జెస్సీని బ‌య‌ట‌కు పంపారు. దీంతో ఆమెకు ఇంకో వారం క‌ల‌సి వ‌చ్చింది. అయితే ఇప్పుడు అనీ మాస్ట‌ర్ ఎలిమినేట్ అవ‌డం కాజ‌ల్‌కు క‌ల‌సి వ‌చ్చింది. కానీ కాజ‌ల్ ఇంకో వారం మాత్ర‌మే ఉంటుంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment