Bigg Boss 5 : సిరి, ష‌ణ్ముఖ్ నిజంగానే ఒక‌రి పెద‌వుల‌పై ఒక‌రు ముద్దులు పెట్టుకున్నారా ?

November 19, 2021 2:38 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ఫైన‌ల్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ షోపై మ‌రింత ఆస‌క్తి పెరుగుతోంది. వారం వారం కంటెస్టెంట్ల సంఖ్య త‌గ్గుతుండ‌డంతో.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల మ‌ధ్య పోటీ పెరుగుతోంది. వారంద‌రూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావ‌డంతో.. పోటీ బాగానే ఉంది. వారికి సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్లు బాగా ఉన్నందున ఓట్లు బాగానే ప‌డుతున్నాయి. దీంతో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారోన‌ని ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా షోను వీక్షిస్తున్నారు.

Bigg Boss 5 did siri and shanmukh really kissed each other in latet episode

అయితే తాజాగా ఓ ఎపిసోడ్‌లో సిరి, ష‌ణ్ముఖ్‌ల వ్య‌వ‌హారం వివాదాస్ప‌దంగా మారింది. వారిద్ద‌రూ ఓ సంద‌ర్భంలో లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్నారంటూ.. సోష‌ల్ మీడియాలో వార్త‌లు తెగ హ‌ల్ చ‌ల్ అవుతున్నాయి. ఓ స‌మయంలో సిరి త‌న లిప్ స్టిక్‌తో ఐ హేట్ యు అని రాసి ష‌ణ్ముఖ్‌కి ఇస్తుంది. దీంతో త‌నను అస‌హ్యించుకోవ‌డానికి గ‌ల కార‌ణం ఏమిటి ? అని ష‌ణ్ముఖ్ అడిగాడు.

అయితే త‌రువాత ఏమైందో తెలియ‌దు కానీ.. ఇద్దరూ ఒక‌రినొక‌రు హ‌గ్ చేసుకుని క‌నిపించారు. ఈ క్ర‌మంలోనే సిరి.. ష‌ణ్ముఖ్‌కు లిప్ టు లిప్ కిస్ ఇచ్చింద‌ని కొంద‌రు ప్రేక్ష‌కులు అంటున్నారు. కానీ కెమెరా యాంగిల్ వ‌ల్ల వారు అలా లిప్ టు లిప్ ఇచ్చుకున్న‌ట్లు క‌నిపించింద‌ని.. అంత‌కు త‌ప్ప వేరే ఏమీ లేద‌ని.. అయినా వారు ఇది వ‌ర‌కే వేరే వ్య‌క్తుల‌తో ల‌వ్‌లో ఉన్నారు.. వారు అలా చేయ‌రు.. అని కొంద‌రు అంటున్నారు.

కాగా.. వారిద్ద‌రి హ‌గ్ సీన్‌కు చెందిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌రోవైపు సినీ న‌టి మాధ‌వీ ల‌త ఈ వీడియోపై స్పందించారు. బిగ్ బాస్ హౌస్ నుంచి అలాంటి వీడియోలు త‌న‌కు వ‌చ్చాయ‌ని.. కానీ తాను వాటిని షేర్ చేయ‌ద‌లుచుకోలేద‌ని.. అది స‌భ్య‌త అనిపించుకోద‌ని.. ఆమె అన్నారు.

కాగా ష‌ణ్ముఖ్ ఇప్ప‌టికే దీప్తి సున‌య‌న‌తో ల‌వ్‌లో ఉండ‌గా.. సిరి శ్రీ‌హాన్ తో రిలేష‌న్ షిప్‌ను మెయిన్‌టెయిన్ చేస్తోంది. ఈ క్ర‌మంలో షోలో రొమాంటిక్ సీన్స్ మ‌రీ పెరిగిపోవ‌డంతో.. కొంద‌రు ఈ షో నిర్వాహ‌కుల‌పై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment