Bhimla Nayak : భీమ్లా నాయ‌క్ టీజ‌ర్, ట్రైల‌ర్‌తో సంద‌డి చేసేందుకు సిద్ధం కాబోతున్నాడు..!

November 25, 2021 6:09 PM

Bhimla Nayak : మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియమ్‌కు తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయ‌క్. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి కలిసి న‌టిస్తున్న ఈ చిత్రంలో భీమ్లా నాయ‌క్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపిస్తుంటే, డానియ‌ల్ శేఖ‌ర్‌గా రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్నారు. పోలీస్ ఆఫీస‌ర్‌, రిటైర్డ్ ఆర్మీ ఆఫీస‌ర్‌కు మ‌ధ్య జ‌రిగే ఈగో క్లాషెష్ ఈ సినిమా అని అంటున్నారు. తెలుగు నేటివిటీ, ప‌వ‌న్ కళ్యాణ్ ఇమేజ్‌ను బేస్ చేసుకుని త్రివిక్ర‌మ్ క‌థ‌లో మార్పులు, చేర్పులు చేశార‌ట‌.

Bhimla Nayak  teaser and trailer will be reading for release

భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు భారీగా ఉండ‌గా, ఇప్పటికే విడుదలైన పాటలు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశాయి. సంగీత దర్శకుడు తమన్ ఎప్పటిలాగే మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటికి సంబంధించిన పాత్రల ఫస్ట్ లుక్ టీజర్స్ అదిరిపోయాయి. అభిమానులు.. ట్రైల‌ర్, టీజ‌ర్స్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, వాటికి సంబంధించిన స‌మాచారం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన టీజర్ ను రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 14న విడుద‌ల చేయనున్నార‌ట‌. ఒక పవర్ఫుల్ హై వోల్టేజ్ టీజర్ ను విడుదల చేయాలని ఇప్పటికే చిత్ర యూనిట్ ఒక ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం. దాదాపు టీజర్ ఫైనల్ కట్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది ఇక ట్రైల‌ర్‌ని జనవరి మొదటి వారంలో 1 లేదా 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment