గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bhimla Nayak : భీమ్లా నాయ‌క్‌.. మ‌ళ్లీ వాయిదా ప‌డ‌నుందా ?

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన తాజా చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీ సంక్రాంతికే విడుద‌ల కావల్సి ఉంది. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ కార‌ణంగా మేక‌ర్స్ విడుద‌ల‌ను వాయిదా వేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే…

Bhimla Nayak : భీమ్లా నాయ‌క్‌.. మ‌ళ్లీ వాయిదా ప‌డ‌నుందా ?

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన తాజా చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీ సంక్రాంతికే విడుద‌ల కావల్సి ఉంది. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ కార‌ణంగా మేక‌ర్స్ విడుద‌ల‌ను వాయిదా వేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే ఈ మూవీ మ‌ళ్లీ వాయిదా ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ను మ‌ళ్లీ ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

Bhimla Nayak reportedly may be postponed

ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న న‌టించిన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమా రిలీజ్ కానుంది. ఆ చిత్ర మేక‌ర్స్ ఆ తేదీని సినిమా విడుద‌ల‌కు లాక్ చేసిన‌ట్లు చెప్పారు. దీంతో ఒకే రోజు ఇద్ద‌రు స్టార్స్ సినిమాలు పోటీ ప‌డ‌నున్నాయి. అయితే పెద్ద స్టార్స్ సినిమాల‌కు ఇది మంచి స‌మ‌యం కాద‌ని, క‌నుక భీమ్లా నాయ‌క్ చిత్ర విడుద‌ల‌ను మ‌రోమారు వాయిదా వేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

గ‌తంలోనూ భీమ్లా నాయ‌క్ చిత్రం ప‌ట్ల ఇలాగే వార్త‌లు వ‌చ్చాయి. కానీ మేక‌ర్స్ వాటిని ఖండించారు. అయితే చివ‌ర‌కు సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రి ఇప్పుడు ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి