Bheemla Nayak : ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న భీమ్లా నాయ‌క్‌.. ఎప్పుడో తెలుసా ?

Bheemla Nayak : ప్ర‌స్తుత త‌రుణంలో చిన్న హీరోల సినిమాలే కాదు.. పెద్ద హీరోల సినిమాలు కూడా విడుద‌లైన నెల రోజుల్లోనే ఓటీటీల్లోకి వ‌చ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్ష‌కులకు కావల్సింత వినోదం ల‌భిస్తోంది. థియేట‌ర్ల‌లో సినిమా చూడ‌కుండా మిస్ అయిన వారు.. చూడ‌లేని వారు.. ఓటీటీల్లో కొత్త సినిమాల‌ను చూస్తున్నారు. అలాగే థియేట‌ర్ల‌లో చూసిన వారు కూడా ఓటీటీల్లో ఇంకోసారి సినిమాల‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదే కోవ‌లో ప్రేక్ష‌కుల‌ను మ‌రోమారు అల‌రించేందుకు భీమ్లా నాయ‌క్ సిద్ధ‌మ‌వుతోంది. ఈ మూవీని త్వ‌ర‌లో ఓటీటీలో స్ట్రీమ్ చేయ‌నున్నారు.

Bheemla Nayak

భీమ్లా నాయ‌క్ చిత్రానికి సంబంధించి డిజిట‌ల్ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌తో పాటు.. ఆహా వీడియో సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఈ రెండు సంస్థ‌లు తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అప్‌డేట్ ఇచ్చాయి. ఈ నెల 25వ తేదీన ఈ మూవీని స్ట్రీమ్ చేయ‌నున్నామ‌ని ఈ రెండు సంస్థ‌లు ఒకేసారి ప్ర‌క‌టించాయి. వ‌చ్చే శుక్ర‌వారం ఇదే రోజున మీ ఇంట్లో ప‌వ‌ర్ స్టార్ తుఫాన్ వ‌స్తుంద‌ని.. సిద్ధంగా ఉండ‌డ‌ని.. తేదీని గుర్తు పెట్టుకోండి.. అంటూ ఆయా సంస్థ‌లు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. దీంతో మార్చి 25వ తేదీన భీమ్లా నాయ‌క్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయింది.

ఇక ఈ మూవీలో ప‌వ‌న్‌, రానాలు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించ‌గా.. నిత్య మీన‌న్‌, సంయుక్త మీన‌న్‌లు వారి ప‌క్క‌న హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాకు సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని తెర‌కెక్కించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM