Beast Movie : మాస్టర్ తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం బీస్ట్. కోలమావు కోకిల, డాక్టర్ చిత్రాలతో తమిళంలో దర్శకుడిగా నిరూపించుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పూజా హెగ్డె ఇందులో ఫస్ట్ టైమ్ విజయ్‌కి జోడీ కట్టింది. సినిమా రిలీజ్‌కి ముందే అనిరుధ్ స్వరపరచిన బాణీలు సంగీత ప్రియులని ఎంతగానో అలరించాయి. ఈ సినిమాలో విజయ్.. భారత రా ఏజెంట్ పాత్రలో నటించాడు. ఈ సినిమాను తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతోపాటు హిందీలోనూ ఏక కాలంలో పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేశారు. తమిళం, తెలుగు సహా అన్ని భాషల్లో బీస్ట్ టైటిల్‌తో విడుదలైతే.. హిందీలో మాత్రం రా అనే టైటిల్‌తో విడుదలైంది.
ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ఇప్పటికే పూర్తి కాగా.. సినిమా విజయ్ వర్సెస్ టెర్రరిస్ట్స్ అన్న నేపథ్యంలో రూపొందిందని తెలుస్తోంది. ఓ షాపింగ్ మాల్‌లోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడి ప్రజలను బందీలుగా మారుస్తారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను ఏ విధంగా రక్షించారనేదే ఈ మూవీ కథ. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుందని, విజయ్ తనదైన కామెడీతో నవ్వించాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టించిన అరబిక్ కుతు సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులను ఈలలు వేయిస్తోందట.
ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంటుందని, సెకండాఫ్ అంతకంటే పడిపోయిందని, చాలా స్లోగా, బోరింగ్‌గా ఉందని అంటున్నారు. విజయ్ ఈ స్క్రిప్ట్ ఎంచుకుని మిస్టేక్స్ చేశారనే కామెంట్లు వస్తున్నాయి. కథ, కథనాలు అస్సలు బాగా లేవని, నెల్సన్ ఈ సారి డిజప్పాయింట్ చేశారని, సినిమాని సరిగా డీల్ చేయలేదని అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా పూర్‌గా ఉన్నాయంటున్నారు. జెట్ సన్నివేశాలు, వీఎఫ్‌ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని అంటున్నారు ట్విట్టర్ ఆడియెన్స్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకి ప్లస్ అంటున్నారు. అయితే విజయ్ ఎంట్రీ సీన్ మాత్రం అదిరిపోతుందట. పూజా గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ అని, మంచి కమర్షియల్ చిత్రమని అంటున్నారు. మొత్తంగా ట్విట్టర్ ఆడియన్స్ నుంచి మాత్రం బీస్ట్ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…