Bandla Ganesh : ఎవ‌రినీ న‌మ్మొద్దంటున్న బండ్ల గ‌ణేష్.. ఇంత‌కీ అస‌లు ఏమైంది..?

June 18, 2022 7:06 PM

Bandla Ganesh : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు బండ్ల గ‌ణేష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న సినిమా న‌టుడిగా ఆ త‌రువాత నిర్మాత‌గా చేశారు. అనంత‌రం రాజ‌కీయాల్లో చేరారు. అక్క‌డ సెట్ కాక‌పోవ‌డంతో మ‌ళ్లీ సినిమాల‌కు వ‌చ్చారు. అయితే ఈ మ‌ధ్య ఆయ‌న చేస్తున్న కామెంట్లు.. పెడుతున్న పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న పెట్టిన పోస్టుల‌ను చూస్తుంటే ఆయ‌న‌లో వైరాగ్యం తాలూకు ఛాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇక తాజాగా ఆయ‌న మ‌ళ్లీ అలాంటిదే ఒక పోస్ట్ పెట్టారు. కానీ ఈసారి ఏకండా తాను మాట్లాడిన మాట‌ల‌కు చెందిన ఆడియోను విడుద‌ల చేశారు. అందులో ఆయ‌న అన్న మాట‌లు ఇలా ఉన్నాయి.

జీవితంలో ఎవరిని నమ్మొద్దు.. మనల్ని మనం నమ్ముకుందాం.. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నమ్ముకుందాం. భార్యను, మనం జన్మనిచ్చిన పిల్లలను ప్రేమిద్దాం. మనల్ని కన్న తల్లిదండ్రులకు మంచి జీవితాన్ని ఇద్దాం. మన తల్లిదండ్రులు మన మీద కోటి ఆశలతో ఉన్నారు. మన పిల్లలకు మంచి దారి చూపిద్దాం. వాళ్ల.. వీళ్ల మోజులో పడి మన పిల్లలను, మన అమ్మనాన్నలను అన్యాయం చేయొద్దు.. వారిని స‌రిగ్గా చూసుకుందాం.. అంటూ బండ్ల గణేష్ ఆ ఆడియోలో అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆడియోను ట్వీట్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది.

Bandla Ganesh said do not believe anybody
Bandla Ganesh

అయితే ఉన్న‌ట్లుండి స‌డెన్ గా బండ్ల గ‌ణేష్ ఇలాంటి పోస్టు పెట్టాడేమిట‌బ్బా.. అని నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. ఇంత‌కీ ఆయ‌న‌ను ఎవ‌రైనా మోసం చేశారా.. అంటూ ఆరాలు తీస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పెట్టిన పోస్టుకు నెటిజ‌న్ల నుంచి భిన్న ర‌కాలుగా కామెంట్లు వ‌స్తున్నాయి. మ‌ద్యం సేవించావా.. అన్న అని కొంద‌రు కామెంట్లు చేస్తుండ‌గా.. ఏమైంది అన్న‌.. ఏదైనా ఎదురుదెబ్బ త‌గిలిందా.. అంటూ నెటిజ‌న్లు ఆయ‌న‌ను అడుగుతున్నారు. అయితే అస‌లు విష‌యం ఏమైంది.. అనేది మాత్రం తెలియ‌డం లేదు. దీనిపై బండ్ల గ‌ణేష్ మ‌ళ్లీ ఏమైనా స్పందిస్తారో.. లేదో.. చూడాలి.

https://twitter.com/ganeshbandla/status/1538043668778872832

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment