Balakrishna : టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. పాత్ర ఎలాంటిదైనా, కథనం ఏదైనా, ఒక్కసారి ఆయన ఎంట్రీ ఇస్తే హిస్టరీ రిపీట్ కావాల్సిందే. బాలయ్య నటనతో, డైలాగ్స్ తో తన అభిమానుల్ని అలరిస్తారు. ఓ వైపు సక్సెస్ ఫుల్ గా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు టాక్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహాలో అన్ స్టాపబుల్ అనే ప్రోగ్రామ్ లో ఆయన యాంకరింగ్ తో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. సరదాలో స్టాప్ ఉండదు.
సై అంటే సై.. నై అంటే నై అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్ వినూత్నంగా ఉన్నాయి. అన్ ఫిల్టర్ టాక్ తో రెడీగా ఉన్నట్లు బాలకృష్ణ యాంకరింగ్ ఉంటుందని హింట్ ఇచ్చారు. అలాగే ఈ ప్రోగ్రామ్ కోసం బాలకృష్ణ మేకోవర్ కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయి. దీపావళి రోజు ప్రారంభించబోయే ఈ టాక్ షోకి బాలకృష్ణకు ఎంట్రీ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రోగ్రామ్ ని నవంబర్ 4 నుండి స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అలాగే ఈ టాక్ షో కోసం బాలయ్య భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ అనే సినిమాలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య బాబు ఓ పాత్రలో అఘోరాగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఏది ఏమైనా బాలకృష్ణ డైలాగ్స్ తోపాటు సినీ సెలెబ్రిటీల విశేషాల్ని తన స్టైల్ లో అడిగే టాక్ షోలో బాలకృష్ణ ప్రజంటేషన్ ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…