Balakrishna : ఫైట్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్ బాల‌య్య సినిమా.. ఫైట్స్ లేకున్నా హిట్ అయిన బాల‌య్య మూవీ ఏదంటే..?

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ మాస్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రెస్ అనే చెప్పాలి. ఆయ‌న సినిమాల‌లో హై ఓల్టేజ్ యాక్ష‌న్ సీన్స్ త‌ప్ప‌క ఉంటాయి. ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్, చేజింగ్ సీన్స్, యాక్ష‌న్ సీన్స్ వంటివి బాల‌య్య సినిమాలో లేక‌పోతే అభిమానుల‌కి నిరాశే ఎదుర‌వుతుంది. అయితే బాల‌య్య సినిమాలో ఒక్క ఫైట్ సీన్ లేకుండా రూపొందిన చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్టైంది. ఆ సినిమా ఏంటో తెలుసా.. నారీ నారీ నడుమ మురారి. ఎ.కోదండరామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. యువచిత్ర బ్యానర్‌పై, కె.నరసింహ నాయుడు నిర్మాతగా, స్టార్ డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, శోభన, నిరోషా హీరోయిన్స్‌గా, కైకాల సత్యనారాయణ, శారద ప్రధాన పాత్రల్లో నటించిన నారీ నారీ నడుమ మురారి చిత్రం.. 1990 ఏప్రిల్ 27న విడుదలైంది.

Balakrishna

కెరీర్‌లో 50వ చిత్రం అయినా ఎటువంటి కమర్షియల్ హంగులకు పోకుండా కుటుంబ కథా చిత్రాన్ని ఎంపిక చేసుకుని.. ప్రేక్షకాభిమానులను అలరించాడు బాలయ్య. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కె.వి.మహదేవన్ స్వరపరచిన పాటలు, నేపథ్య సంగీతం, ఎ.విన్సెంట్, అజయ్ విన్సెంట్ కెమెరా వర్క్, ఆచార్య ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల పాటలు, తనికెళ్ల భరణి, భమిడిపాటి రాధాకృష్ణ, జి.సత్యమూర్తి, వినాయక శర్మ రాసిన మాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి.

ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం విశేషం. బాలయ్య నటజీవితంలో నారీ నారీ నడుమ మురారి ప్రత్యేకమైన చిత్రం అని చెప్పొచ్చు. బాలయ్య నటన, కామెడీ టైమింగ్, డ్యాన్సులు.. అభిమానులను అలరించాయి. తమిళనాడులో వేలచ్చేరి ప్రాంతంలోని చిరంజీవి గెస్ట్ హౌస్ లో ఈ మూవీ షూటింగ్ జరిగింది. ఇప్ప‌టికీ ఈ సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌కులు టీవీల‌కు అతుక్కుపోతుంటారు. మాస్ హీరో క్లాస్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో చెప్ప‌డానికి.. నారీ నారీ నడుమ మురారి సినిమానే నిదర్శనం అని చెప్పొచ్చు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM