జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఆమె, ఇప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో ప్రధాన కథానాయికగా అవకాశాలు దక్కించుకుంటూ తన సత్తా చాటుతన్నారు. ట్రెండ్స్ మారుతున్నా, వయస్సు అనే అడ్డంకిని లెక్కచేయకుండా ప్రియమణి తన స్థానాన్ని నిలబెట్టుకోవడం సినీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే పలు భాషల్లో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రియమణి, తాజాగా మరో భారీ తెలుగు ప్రాజెక్ట్ కు సంతకం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఆమె అందుకుంటున్న పారితోషికం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ హై ప్రొఫైల్ సినిమాకు ఆమెకు రూ.1 కోటి కంటే ఎక్కువగా అందిస్తున్నారని సమాచారం.
ఇండియా డైలీ లైవ్ తెలుసుకున్న సమాచారం ప్రకారం, ప్రియమణి నేరుగా చిరంజీవి సరసన నటించన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌తో గతంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన బాబీ మరోసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్. ఈ మాస్ ఎంటర్‌టైనర్ షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కీలకమైన మహిళా పాత్ర ఉండగా, ఆ పాత్రకు ప్రియమణిని ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వాల్తేర్ వీరయ్యతో మెగాస్టార్‌కు భారీ విజయం అందించిన బాబీ, ఈసారి కూడా అదే రేంజ్‌లో ప్రేక్షకులను అలరించే కథతో రాబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా చిరంజీవి సరసన నటించిన తాజా హీరోయిన్లలో తమన్నా, నయనతార, త్రిష వంటి గ్లామర్ ఇమేజ్ ఉన్న నటీమణులు ఉన్నారు. అలాంటి నేపథ్యంలో, ఆ వర్గానికి చెందకపోయినా ప్రియమణికి ఇంత భారీ పారితోషికం లభించడం ఆమె మార్కెట్ విలువకు నిదర్శనంగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…