ఉద్యోగాలు

RRB గ్రూప్-డి నోటిఫికేషన్ 2026: 22 వేల ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి!

ఆర్ఆర్బీ గ్రూప్-డి 2026 నోటిఫికేషన్ పూర్తి వివరాలు. Photo Credit: iStock.

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. మొత్తం 22,000 ఖాళీలు భర్తీ చేయనున్న ఈ నోటిఫికేషన్‌కు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభ బేసిక్ పే నెలకు రూ.18,000గా ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 2, 2026 (రాత్రి 11:59 వరకు) గడువు ఉంది. మొదట జనవరి 21 నుంచి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పరిపాలనా కారణాలతో వాయిదా పడింది.

అర్హతలు (Eligibility)..

  • అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు వర్తిస్తుంది.
  • ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ తప్పనిసరి.
  • పేరు, జన్మతేది, ఫొటో వంటి వివరాలు 10వ తరగతి సర్టిఫికేట్‌తో సరిపోలేలా ఉండాలి.

ఎంపిక విధానం (Selection Process)..

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT).
  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) – CBTలో అర్హత సాధించిన వారికి మాత్రమే.

దరఖాస్తు ఫీజు (Application Fee)..

జనరల్ / OBC / EWS అభ్యర్థులకు రూ.500. (ఇతర కేటగిరీలకు సంబంధించిన ఫీజు నిబంధనలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు).

RRB గ్రూప్ D 2026కు దరఖాస్తు విధానం..

  • అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.inకి వెళ్లండి.
  • హోమ్‌పేజీలో Recruitment for various posts in Level 1 of 7th CPC Matrix లింక్‌పై క్లిక్ చేయండి.
  • ఆధార్ లేదా RRB క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వండి.
  • అవసరమైన వివరాలు నమోదు చేసి దరఖాస్తు సమర్పించండి.

రైల్వేలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే యువతకు ఇది కీలక అవకాశం. గడువు దగ్గరపడేలోపు ఆధార్ వివరాలు సరిచూసుకుని, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

గమనిక: అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చద‌వగలరు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM

విడాకుల తర్వాత గోల్డెన్ టెంపుల్‌లో హన్సిక.. వైరల్ అవుతున్న ‘కీలక’ పోస్ట్!

వ్యాపార వేత్త సోహైల్ ఖ‌తురియాతో విడాకులు తీసుకున్న అనంత‌రం హ‌న్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీల‌క పోస్టు…

Wednesday, 18 March 2026, 12:31 PM

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM