Balakrishna : అఖండ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మోకాలికి సర్జరీ జరిగిందని జోరుగా ప్రచారం జరిగింది. మైనర్ సర్జరీనే అని.. ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని డాక్టర్లు సూచించినట్లు.. బాలకృష్ణ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అభిమానులు ఎవ్వరూ కంగారు పడాల్సిన పనిలేదని డాక్టర్లు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా విడుదలైన ఫొటోలో బాలయ్య కాలికి కట్టుకట్టిన ఫోటోలు.. డాక్టర్ల బృందం ఉండడంతో అందరూ నిజమే అని నమ్మారు.
అయితే భుజానికి సర్జరీ జరిగిన కొన్ని రోజులుగా మళ్లీ మోకాలికి సర్జరీ ఏంటి ? అని అభిమానుల్లో కంగారు మొదలైంది. దీంతో అసలు బాలయ్య ఆరోగ్యం వెనుక అసలేం జరుగుతుందంటూ మీడియా కథనాలు హీటెక్కిస్తున్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణ స్పందించారు. కేవలం రెగ్యులర్ చెకప్ ల కోసమే ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపారు. దయచేసి ఎలాంటి అవాస్తవాలు ప్రచురించ వద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే బాలకృష్ణ తన 107వ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సారథి స్టూడియోలో జరుగుతోంది.
తాజాగా బాలయ్య యథావిధిగా షూటింగ్ కి హాజరయ్యారు. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న తన 107వ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్య ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా పక్కా మాస్ గోపీ మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నాడు. బోయపాటి దర్శకత్వంలో కూడా సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాని ఎలక్షన్స్ సమయంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…