గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Balakrishna : బాలకృష్ణ కాలు స‌ర్జ‌రీలో వాస్త‌వమెంత‌.. ఆ ఫోటో వెన‌క ఉన్న సీక్రెట్ ఏంటి ?

Balakrishna : అఖండ సినిమా షూటింగ్ స‌మ‌యంలో బాల‌య్య స‌ర్జ‌రీ చేయించుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న మోకాలికి స‌ర్జ‌రీ జ‌రిగింద‌ని జోరుగా ప్రచారం జరిగింది. మైనర్ సర్జరీనే అని.. ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని డాక్టర్లు…

Balakrishna : బాలకృష్ణ కాలు స‌ర్జ‌రీలో వాస్త‌వమెంత‌.. ఆ ఫోటో వెన‌క ఉన్న సీక్రెట్ ఏంటి ?

Balakrishna : అఖండ సినిమా షూటింగ్ స‌మ‌యంలో బాల‌య్య స‌ర్జ‌రీ చేయించుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న మోకాలికి స‌ర్జ‌రీ జ‌రిగింద‌ని జోరుగా ప్రచారం జరిగింది. మైనర్ సర్జరీనే అని.. ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని డాక్టర్లు సూచించినట్లు.. బాలకృష్ణ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అభిమానులు ఎవ్వరూ కంగారు పడాల్సిన పనిలేదని డాక్టర్లు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా విడుద‌లైన ఫొటోలో బాలయ్య కాలికి కట్టుకట్టిన ఫోటోలు.. డాక్టర్ల బృందం ఉండ‌డంతో అంద‌రూ నిజ‌మే అని న‌మ్మారు.

Balakrishna got surgery what is about that photo
Balakrishna

అయితే భుజానికి సర్జరీ జరిగిన కొన్ని రోజులుగా మళ్లీ మోకాలికి సర్జరీ ఏంటి ? అని అభిమానుల్లో కంగారు మొదలైంది. దీంతో అసలు బాలయ్య ఆరోగ్యం వెనుక అసలేం జరుగుతుందంటూ మీడియా కథనాలు హీటెక్కిస్తున్నాయి. ఈ క్ర‌మంలో బాల‌కృష్ణ స్పందించారు. కేవలం రెగ్యులర్ చెకప్ ల కోసమే ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపారు. దయచేసి ఎలాంటి అవాస్తవాలు ప్రచురించ వద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే బాలకృష్ణ తన 107వ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సారథి స్టూడియోలో జ‌రుగుతోంది.

తాజాగా బాలయ్య యథావిధిగా షూటింగ్ కి హాజరయ్యారు. ప్ర‌స్తుతం బాల‌య్య చేస్తున్న త‌న 107వ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్య ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా పక్కా మాస్ గోపీ మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయ‌నున్నాడు. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో కూడా సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాని ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి