Bahubali Netflix Series : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి రెండు సినిమాలు సృష్టించిన కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్‌ను సెట్ చేసింది. దీంతో ఈ మూవీలకు ప్రీక్వెల్‌గా ఓ సిరీస్‌ను తీయాలని అప్పట్లో నిర్ణయించారు. నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ ప్రాజెక్టుకు పూనుకుంది. అయితే తాజాగా ఈ సిరీస్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసలు అన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ ఈ సిరీస్‌ను ఎందుకు రద్దు చేశారని.. ప్రేక్షకులు సమాధానాల కోసం వెదుకుతున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. రచయిత ఆనంద్ నీలకంఠన్.. ది రైజ్ ఆఫ్ శివగామిని రచించారు. బాహుబలి మొదటి పార్ట్‌కు 40 ఏళ్ల ముందు అసలు ఏం జరిగింది ? అన్న వివరాలు ఆ కథలో ఉంటాయి. అందులో ప్రధానంగా శివగామి, కట్టప్పల మధ్య ప్రేమ కథ, మాహిష్మతి సామ్రాజ్యం గురించిన ముఖ్యమైన విశేషాలు.. ఉన్నాయి. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ దీన్ని.. బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ పేరిట సిరీస్‌లా తీయాలని భావించింది.
అయితే తాజాగా ఈ సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై రూ.150 కోట్ల మేర ఖర్చు పెట్టారని సమాచారం. అయినప్పటికీ నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టును రద్దు చేయాలనే ముందుకు సాగింది.
అయితే ఈ సిరీస్ గురించి రాజమౌళి ఇప్పటి వరకు పట్టించుకోలేదట. నిర్మాత శోభు యార్లగడ్డ.. రాజమౌళిని ఒప్పించడంలో ఫెయిల్ అయినట్లు తెలిసింది. రాజమౌళి అసలు ఏమాత్రం ఈ ప్రాజెక్టు వైపు చూడలేదట. ఇక దేవా కట్టా, ప్రవీణ్ సత్తారులు వెబ్ సిరీస్‌ను తీసి ఫస్ట్ కాపీని సిద్ధం చేసినా నెట్‌ఫ్లిక్స్‌కు అది ఏమాత్రం నచ్చలేదట. మరోవైపు రాజమౌళి పట్టించుకోలేదు. అందువల్లే ఇకపై ఈ ప్రాజెక్టును ముందుకు కొనసాగించలేమని భావించిన నెట్ ఫ్లిక్స్ రూ.150 కోట్లు పెట్టినప్పటికీ ఈ ప్రాజెక్టును రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది.
అయితే రాజమౌళి ఈ సిరీస్ గురించి పట్టించుకుని కాస్తంత శ్రద్ధ వహించి ఉంటే ఈ సిరీస్ ఇప్పటికే రిలీజ్ అయి ఉండేదని అంటున్నారు. అసలు రాజమౌళి దీని గురించి ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావడం లేదని పలువురు అంటున్నారు. మరి దీనిపై రాజమౌళి స్పందిస్తారో లేదో చూడాలి..!
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…