గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Avika Gor : అందాలతో సెగలు పెంచుతున్న అవికా గోర్‌..!

Avika Gor : చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి.. అవికా గోర్‌. ఈమె బాలనటిగానే కాక హీరోయిన్‌గా కూడా పలు హిట్‌ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె నటించిన…

Avika Gor : అందాలతో సెగలు పెంచుతున్న అవికా గోర్‌..!

Avika Gor : చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి.. అవికా గోర్‌. ఈమె బాలనటిగానే కాక హీరోయిన్‌గా కూడా పలు హిట్‌ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె నటించిన అనేక చిత్రాలు విజయవంతం అయ్యాయి. దీంతో ఒక దశలో అవికా గోర్‌కు వరుస ఆఫర్లు వచ్చాయి. ఈమె తొలిసారిగా మార్నింగ్‌ వాక్‌ అనే హిందీ సినిమాలో బాలనటిగా అలరించింది. తరువాత హీరోయిన్ గా తెలుగులో మొదటి చిత్రం చేసింది. రాజ్‌ తరుణ్‌తో కలిసి ఈమె నటించిన ఉయ్యాల జంపాల హిట్‌ అయింది. దీంతో ఈమె వెనుదిరిగి చూసుకోలేదు.

అయితే ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించినప్పటికీ అవికా గోర్‌కు ప్రస్తుతం ఆఫర్లు పెద్దగా లేవు. అయినప్పటికీ సోషల్‌ మీడియాలో ఈమె యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను అందులో షేర్‌ చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. అవికా గోర్‌ ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి ఇంతా కాదు. ఆఫర్లు లేకపోయినా.. గ్లామర్‌ షోకు మాత్రం తక్కువ కాకుండా ఈమె అందాలను ఆరబోస్తోంది. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈమె అందాలను ఆరబోయక తప్పని పరిస్థితి నెలకొంది. తోటి హీరోయిన్లతో పోటీ ఉండాలంటే ఆ మాత్రం చేయాలన్నట్లుగా ఈమె వ్యవహార శైలి మారింది.

Avika Gor red and blue color jeans dress photos trending
Avika Gor

ఇక అవికా గోర్‌ తాజాగా షేర్‌ చేసిన ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. యువతలో మరింత హీట్‌ పెంచుతున్నాయి. నడుము అందాలను చూపిస్తూ అవికా గోర్‌ షేర్‌ చేసిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో వాటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె థాంక్‌ యూ అనే చిత్రంతోపాటు టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌, ఐ గో టూ స్కూల్‌, 1920 హార్రర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌ అనే సినిమాల్లో నటిస్తోంది. మరి ఈ చిత్రాలతో అయినా ఈమె రాత మారుతుందో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి