గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Aryan Khan : ఖర్చుల కోసం రూ.4500 మనియార్డర్ పంపిన షారూఖ్.. పేరెంట్స్‌ని చూసి గుక్క‌పెట్టి ఏడ్చిన ఆర్య‌న్..!

Aryan Khan : బాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కు తన పేరేంట్స్ తో మాట్లాడే అవకాశం కల్పించారు. ముంబైలో ఆర్థర్ రోడ్ జైలు నుండి వీడియో కాల్ లో షారుఖ్ ఖాన్,…

Aryan Khan : ఖర్చుల కోసం రూ.4500 మనియార్డర్ పంపిన షారూఖ్.. పేరెంట్స్‌ని చూసి గుక్క‌పెట్టి ఏడ్చిన ఆర్య‌న్..!

Aryan Khan : బాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కు తన పేరేంట్స్ తో మాట్లాడే అవకాశం కల్పించారు. ముంబైలో ఆర్థర్ రోడ్ జైలు నుండి వీడియో కాల్ లో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ తో మాట్లాడారు. ఈ క్రమంలో కన్నీటి పర్యంతమైనట్లుగా తెలుస్తోంది. జైలులో ఉన్న ప్రతి వ్యక్తికి ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. అలాగే ఆర్యన్ కు వీడియో కాల్ అవకాశాన్ని కల్పించారు.

Aryan Khan cried on video call at shahrukh khan and gouri khan

డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై రెండు రోజులుగా విచారణ జరిపిన సెషన్స్ కోర్ట్ తీర్పును రిజర్వ్ లో పెట్టింది. దీంతో ఆర్యన్ మరో 4 రోజుల పాటు ఆర్థర్ రోడ్ జైలులో ఉండాల్సిందే. ఆర్యన్ ఖాన్ లో జైలులో క్యాంటీన్ ఖర్చులకు రూ.4500 లను కుటుంబ సభ్యులు పంపారు. ఆర్యన్ ఖాన్ కు ఖైదీ నంబర్ N956 ను ఇచ్చారు. కరోనా పరీక్షల్లో ఆర్యన్ తో పాటు ఆర్భాజ్ కు నెగిటివ్ వచ్చిందని.. అతన్ని సాధారణ సెల్ కు తరలించారు. మ‌రోవైపు పేరెంట్స్‌తో వీడియో కాల్ కూడా చేయించార‌ట‌. ఆ స‌మ‌యంలో ఆర్య‌న్ గుక్క పెట్టి ఏడ్చిన‌ట్టు తెలుస్తోంది.

అక్టోబర్ 2వ తేదీన ముంబై క్రూయిజ్ లో డ్రగ్స్ పార్టీలో జరిగిన రైడ్ లో ఆర్యన్ ఖాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని బెయిల్ పిటిషన్ పై వరుసగా హీట్ డిస్కషన్స్ జరిగాయి. ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను మరోసారి వ్యతిరేకించారు. ఎన్సీబీ ఆరోపణలను ఆర్యన్ తరపు న్యాయవాదులు కొట్టిపారేశారు. సెలబ్రిటీస్ పిల్లలైతే తప్పు చేస్తే బెయిల్ ఇవ్వకూడదని అన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈనెల 20వ తేదీ వరకు రిజర్వ్ లో పెట్టారు. మరి 20వ తేదీకైనా ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయం ఓ కొలిక్కి వస్తుందో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి