Arha : అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ.. శాకుంతలం సినిమాతో వెండితెర ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్హ యువరాజు భరతుడిగా కనిపించబోతోంది. ఇప్పటికే తనకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తి చేశారు. చిత్రీకరణ సందర్భంగా అల్లు అర్జున్ – స్నేహారెడ్డి సెట్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఎందరినో బాలనటులుగా పరిచయం చేసిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్ అర్హను కూడా తెరకు పరిచయం చేస్తున్నారు.
అర్హ గురించి తాజాగా సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `అల్లు అర్హ జన్మతః రాక్ స్టార్ గా పుట్టిందని.. తన తొలి స్టెప్ లోనే మంచి మార్గాన్ని ఎంచుకుందని.. అలాంటి అర్హ తన సినిమా ద్వారా నటిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది. సెట్స్‌లో 200 నుంచి 300 ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఉన్నా కూడా తను చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. తను చక్కగా తెలుగు మాట్లాడుతుంది.
అర్హ పుట్టుకతోనే సూపర్‌స్టార్. నా సినిమాతో తెరంగేట్రం చేయడం మరింత ఆనందాన్నిచ్చింది. ఆమె ఈ సినిమా పరిశ్రమను ఏలుతుంది. శాకుంతలం సినిమా చూసిన తర్వాత ఆ మాటతో అందరూ ఏకీభవిస్తారు.. అంటూ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాగా.. శాకుంతలం సినిమా కోసం అర్హ పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొనగా, అల్లు అర్జున్ ఫాల్కన్ నే దించేశారు. అర్హకు ఎలాంటి కష్టం లేకుండా `ఫాల్కన్ బస్`ని ఏర్పాటు చేయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…