Tamannaah : వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా.. ఎఫ్3. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో వసూళ్లను వసూలు చేస్తోంది. దీంతో సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోనూ చేరింది. ఇక త్వరలోనే బ్రేక్ ఈవెన్ కూడా సాధించనుంది. ఎఫ్2 కన్నా భారీ స్థాయిలో ఈమూవీ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగానే చిత్ర బృంద సభ్యులు సక్సెస్ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందు ప్రమోషన్లలో తమన్నా ఎక్కడా కనిపించలేదు. దీంతో చిత్ర యూనిట్‌కు, తమన్నాకు మధ్య గొడవ జరిగిందని అందరూ అనుకున్నారు. ఈ వార్తలపై చిత్ర యూనిట్ కూడా స్పందించలేదు. అయితే ఇదే విషయంపై అనిల్ రావిపూడి స్పందించారు.
తమన్నాతో గొడవ ఏమైనా పడ్డారా.. ఆమె చిత్ర రిలీజ్‌కు ముందు జరిగిన ప్రమోషన్లలో ఎందుకు పాల్గొనలేదు.. అని పలువురు ప్రశ్నించగా.. అందుకు ఎఫ్3 దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అలా ఏమీ లేదు, అవన్నీ పుకార్లే, వాస్తవానికి తమన్నా ఆ సమయంలో కేన్స్ ఉత్సవాల్లో బిజీగా ఉంది. కనుకనే ఆమె ప్రమోషన్లకు రాలేదు.. అని అనిల్ రావిపూడి చెప్పారు.
అయితే అంత వరకు బాగానే ఉన్నా.. సోషల్ మీడియా అయితే చేతిలో ఉందిగా.. మరి సినిమా రిలీజ్ అయ్యే సమయంలో కనీసం అందులో అయినా ఒక పోస్ట్ పెట్టవచ్చు కదా. తమన్నా కనీసం ఆ పని కూడా చేయలేదు. అంటే.. సోషల్ మీడియాను వాడేంత సమయం కూడా తమన్నాకు దొరకలేదా.. అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏది ఏమైనా.. అనిల్ రావిపూడి సమాధానం చెప్పారు కానీ.. అది అంత సంతృప్తిగా లేదు. మరి ముందు ముందు దీనిపై క్లారిటీ ఏమైనా వస్తుందేమో చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…