Anchor Suma : బాగా అప్‌సెట్ అయిన యాంక‌ర్ సుమ‌..? షాకింగ్ నిర్ణ‌యం..?

June 16, 2022 9:55 AM

Anchor Suma : యాంక‌ర్ సుమ గురించి ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రిస్తోంది. అలాగే ఏ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగినా ఈమె త‌ప్ప‌నిస‌రి. అయితే కెరీర్ మొద‌ట్లో సుమ ముందుగా సినిమాల్లోనే న‌టించింది. కానీ అవి వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో యాంక‌రింగ్ వైపు మ‌ళ్లింది. ఆ రంగంలో స‌క్సెస్ సాధించింది. ఇక వెండితెర‌పై అప్పుడ‌ప్పుడు ప‌లు సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో ఈమె క‌నిపిస్తూనే వ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ పూర్తి స్థాయి నిడివి ఉన్న చిత్రాల్లో మాత్రం ఈమె న‌టించ‌డం లేదు. అయితే ఇటీవ‌లే జ‌య‌మ్మ పంచాయితీ సినిమాతో మ‌ళ్లీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది.

కాగా బాక్సాఫీస్ వ‌ద్ద జ‌య‌మ్మ పంచాయితీ సినిమా తీవ్ర నిరాశ‌ప‌రిచింది. అలాగే ఓటీటీలోనూ ఈ మూవీకి అంత‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. దీంతో యాంక‌ర్ సుమ తీవ్రంగా అప్‌సెట్ అయింద‌ట‌. ఇక‌పై చిన్న బ‌డ్జెట్ ఉండే చిత్రాల్లో న‌టించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. జ‌య‌మ్మ పంచాయితీ సినిమా ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ కొంద‌రు ద‌ర్శ‌కులు ఆమెతో సినిమాలు తీసేందుకు ఆమెను క‌ల‌వాల‌ని చూస్తున్నార‌ట‌. కానీ ఆమె వ‌ద్ద‌ని చెబుతోంద‌ట‌. చిన్న బ‌డ్జెట్ సినిమాల్లో న‌టించ‌బోన‌ని వారికి చెబుతోంద‌ట‌. ఎందుకంటే.. తాను ఇక‌పై ప్ర‌యోగాలు చేయ‌ద‌లుచుకోలేద‌ని.. క‌నుక చిన్న బ‌డ్జెట్ నిర్మాత‌లు త‌న కోసం డ‌బ్బు పెట్టి అన‌వ‌స‌రంగా న‌ష్ట‌పోవ‌ద్ద‌ని చెబుతోంద‌ట‌. కాబ‌ట్టే ఈమె చిన్న బ‌డ్జెట్ సినిమాల్లో ఇక న‌టించ‌బోన‌ని అంటుంద‌ట‌. ఏవైనా బ‌డా బ‌డ్జెట్ సినిమాల్లో చిన్న క్యారెక్ట‌ర్‌లో అయినా న‌టిస్తాను కానీ.. చిన్న బ‌డ్జెట్ సినిమాల్లో న‌టించ‌బోన‌ని.. నిర్మాత‌ల‌కు న‌ష్టం తేలేన‌ని.. అంటోంద‌ట‌. దీంతో సుమ నిర్ణ‌యంపై ప్రేక్ష‌కులు షాక‌వుతున్నారు.

Anchor Suma very upset with Jayamma Panchayithi movie result
Anchor Suma

అయితే ఒక్క సినిమాకే ఇలా అయితే ఇంత‌టి షాకింగ్ నిర్ణ‌యాన్ని ఎవ‌రూ తీసుకోరు. మళ్లీ మ‌ళ్లీ ప్ర‌య‌త్నిస్తారు. అవి కూడా విఫ‌ల‌మైతేనే అప్పుడు నిర్ణ‌యం తీసుకుంటారు. కానీ సుమ ఒక్క సినిమాకే ఇలా నిర్ణ‌యం తీసుకుంద‌ని అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అంటే.. సుమ ఇక‌పై కేవ‌లం బుల్లితెర‌కే ప‌రిమితం అవుతుంద‌న్న‌మాట‌. లేదంటే ఆమెను వెండితెర‌పై చూడాలంటే.. ఏదైనా పెద్ద సినిమాలో చిన్న రోల్‌లో చూడాలి. ఏది ఏమైనా.. జ‌య‌మ్మ పంచాయితీ మాత్రం సుమ‌కు తీవ్ర నిరాశ‌ను మిగిల్చింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment