Anchor Suma : బుల్లితెరపై అత్యంత సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న యాంకర్ ఎవరు ? అని ప్రశ్నిస్తే.. మనకు ఠక్కున గుర్తుకు వచ్చే పేరు.. సుమ. ఈమె గతంలో సినిమాల్లో చేసింది. కానీ గెస్ట్ క్యారెక్టర్లు మాత్రమే. అయితే పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రలో సుమ వెండితెరపై నటించి చాలా కాలమే అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె మళ్లీ వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆమె నటించిన జయమ్మ పంచాయితీ అనే సినిమా త్వరలో విడుదల కానుంది. దీంతో చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
సుమ నటించిన జయమ్మ పంచాయితీ అనే మూవీ ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంచ్ చేశారు. ఆమె చాలా ఏళ్ల తరువాత ఈ సినిమాలో పూర్తి స్థాయిలో పాత్రలో కనిపించనుంది. ఇక ట్రైలర్ ను చూస్తే సినిమా కథ కాస్త అర్థమైనట్లు తెలుస్తోంది. జయమ్మకు ఒక సమస్య వస్తే దాన్ని ఊరి పంచాయితీ ముందు పెడుతుంది. కానీ ఆ విషయం ఆమె భర్తకు నచ్చదు. ఇక అదే సమయంలో ఊరికి కూడా ఇంకో సమస్య వస్తుంది. దీంతో పంచాయితీ పెద్దలు ఆమె సమస్యను పక్కన పెట్టి ఊరి సమస్య కోసం పనిచేస్తుంటారు. ఈ క్రమంలో అసలు జయమ్మకు వచ్చిన సమస్య ఏమిటి.. ఊరి సమస్య ఏమిటి.. వాటిని వారు ఎలా పరిష్కరించారు.. అన్న వివరాలు తెలియాలంటే.. సినిమా విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే.
ఇక ఈ సినిమాలో సుమ పక్కా గ్రామీణ మహిళ పాత్రలో నటించినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. అయితే సుమ మనకు బయట చాలా జోవియల్‌గా.. క్యాజువల్‌గా.. అందరినీ నవ్విస్తూ మాట్లాడుతుంటుంది. కానీ సినిమాలో మాత్రం వేరే. ఆమె ట్రైలర్ చివర్లో ఒక పరమ బూతు మాట అంటుంది. అనకుండా ఆ మాటను మింగేస్తుంది. దీంతో ఆ మాట ఏమిటనేది మనకు ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఎంతో పద్ధతిగా మాట్లాడే సుమ.. ఇలా పచ్చి బూతు మాట్లాడడంపై నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. ఆమె సినిమాలోనే ఆ మాటను మాట్లాడినప్పటికీ ఆ డైలాగ్ ను మాత్రం ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దీంతో ఆమె అన్న బూతు మాటకు అందరూ షాకవుతున్నారు. ఇక జయమ్మ పంచాయితీ సినిమా మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…