Anchor Shyamala : బుల్లితెర ఫేమస్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. సీరియల్స్, వంటల ప్రోగ్రాంలు, సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలతో బాగానే ఫేమస్ అయింది. అయితే బిగ్ బాస్ రెండో సీజన్‌తో శ్యామలకు క్రేజ్ వచ్చింది. గీతామాధురి, శ్యామల, యాంకర్ దీప్తి గ్యాంగ్.. ఆ సీజన్‌లో బాగానే హల్చల్ చేసింది. మధ్యలో ఎలిమినేట్ అయితే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ కౌశల్ ఆర్మీ దెబ్బకు శ్యామల బలైపోయింది. అయితే ఇటీవల తన భర్తపై వచ్చిన ఆరోపణలపై శ్యామల కూడా వార్తలలోకి ఎక్కింది.
శ్యామల భర్తపై ఛీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. రాయదుర్గం పోలీసులు చీటింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. తన వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకుని ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ నరసింహా రెడ్డిపై ఖాజా గూడకు చెందిన సింధూరా రెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ అయ్యాడు నరసింహా. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.
రీసెంట్‌గా యాంకర్ శ్యామల కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన గృహప్రవేశం వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేయగా కొద్ది గంటల్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నూతన ఇంట్లోకి మారిన శ్యామల దంపతులకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వేడుకకు నటులు అలీ, సుమ, రాజీవ్ కనకాల, తనీష్‌లతోపాటు సింగర్ గీతా మాధురి సహా పలువురు హాజరయ్యారు. అయితే ఈ ఖరీదైన విల్లాని మొత్తం పాలరాతితో నిర్మించడం విశేషం.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…