Anchor Ravi : ఆ సినిమా వల్ల కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది..!

October 25, 2021 9:34 AM

Anchor Ravi : తెలుగు బుల్లితెర యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న రవి ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో టాస్క్ లలో పాల్గొంటూ దూసుకుపోతున్న రవి ఒకానొక సమయంలో ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన మాట వల్ల తీవ్ర దుమారం చెలరేగింది.

Anchor Ravi said he faced problems with that movie

సినిమా ఆడియో ఫంక్షన్లకు యాంకర్ గా వ్యవహరించిన రవి.. నాగ చైతన్య హీరోగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం.. సినిమాప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా జరిగిన సంఘటన కారణంగా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా నటుడు చలపతిరావు మాట్లాడుతూ.. ఆడవారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో మైక్ రిసీవర్లు సరిగా పనిచేయని నేపథ్యంలో అతని మాటలు సరిగ్గా వినపడక పోవడంతో సూపర్ సార్ అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

తన ఇంట్లో కూడా ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారని.. తను ఆడవాళ్ళని ఎంతో గౌరవిస్తానని.. ఏమాత్రం కించపరచనని రవి పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో తాను క్షమాపణ చెప్పి ఉంటే అన్ని సర్దుకుపోయేవని.. కానీ తాను చేయని తప్పుకు క్షమాపణ చెప్పడం ఇష్టం లేక కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని.. ఒకానొక సందర్భంలో రవి తెలియజేశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment