Anchor Pradeep : వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంచలనాలను సృష్టించడంలో ముందే ఉంటోంది. అందులో భాగంగానే క్యాష్, ఢీ, జబర్దస్త్ వంటి షోలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. అయితే గత కొంత కాలంగా ఢీ, జబర్దస్త్ షోలకు రేటింగ్స్ తక్కువగా వస్తున్నాయి. అందుకు కారణం.. స్టార్ యాంకర్లు, కమెడియన్లు ఈ షోలను విడిచిపెడుతుండడమే అని చెప్పవచ్చు. అప్పట్లో నాగబాబు జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పారు. మల్లెమాలపై ఆయన సీరియస్ ఆరోపణలు చేశారు. వారు రెమ్యునరేషన్ తక్కువగా ఇస్తారని.. కనీసం భోజనం కూడా పెట్టించరని మండిపడ్డారు. అయితే నాగబాబు తరువాత మళ్లీ ఇప్పుడే ఈ షోలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.
ఢీ 13 భారీ సక్సెస్‌ను సాధించగా.. తరువాత ఢీ 14 నుంచి జడ్జి పూర్ణ, రష్మి, సుధీర్, దీపికా పిల్లిలను తొలగించారు. వాస్తవానికి వీరి కారణంగానే ఢీ 13 సక్సెస్ అయింది. అయితే జబర్దస్త్ నుంచి కూడా స్టార్ కమెడియన్స్ దూరం అయ్యారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఈ షోలలో స్టార్ యాంకర్స్, కమెడియన్లు దూరం కావడంతో కళ తగ్గింది. దీంతో సహజంగానే రేటింట్స్ కూడా తగ్గాయి. ఇక ఢీ షోకు యాంకర్ ప్రదీప్ కూడా గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.
ఢీ 14తో ప్రదీప్ అగ్రిమెంట్ ముగియనుంది. ఈ క్రమంలోనే ఢీ 15లో అతను కనిపించబోవడం లేదని తెలుస్తోంది. అయితే ప్రదీప్ కూడా దూరమైతే ఈ షో రేటింగ్స్ మరింత పడిపోతాయని అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా వీరందరూ మల్లెమాలతో ఉన్నారు. కానీ ఒక్కసారిగా మూకుమ్మడిగా ఈ సంస్థ నుంచి వెళ్లిపోతున్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రెమ్యునరేషన్‌తోపాటు ఇతర విషయాల్లోనూ మల్లెమాల టీమ్ పెద్దగా పట్టించుకోవడం లేదని.. కనుకనే విసుగు చెందిన వారు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. అయితే ఢీ షోకు ప్రదీప్ కూడా దూరమైతే ఈ షో రేటింగ్స్ మొత్తం ఢమాల్ అనడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికైనా జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటారా.. లేదా ఇలాగే నిష్క్రమణల పర్వం కొనసాగుతుందా.. అన్న విషయం వేచి చూస్తే తెలుస్తుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…