Ananya Panday : బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే ఈ మధ్య కాలంలో వరుస ఫొటోషూట్‌లతో అలరిస్తోంది. హీరోయిన్స్ గ్లామర్ షో చేయడం మామూలే అయినా.. అనన్య పాండే మాత్రం అందరి కన్నా ముందు వరుసలో నిలుస్తుందని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో ఈ అమ్మడు చేస్తున్న ఫొటోషూట్స్ కుర్రకారు మతులను పోగొడుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా అనన్య పాండే చేసిన ఫొటోషూట్ హీటెక్కిస్తోంది. ఎద అందాలను చూపిస్తూ ఈమె చేసిన ఫొటోషూట్ తాలూకు ఫోటోలు ఒక రేంజ్‌లో ఉన్నాయి.

సోషల్ మీడియాలో అనన్య పాండే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన గ్లామర్‌తో అభిమానులను పెంచుకుంటూనే ఉంది. ఇప్పటికే ఈమెకు సామాజిక మాధ్యమాల్లో ఎన్నో లక్షల మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఈమె అందానికే కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
Ananya Panday : గెహ్రాయియా అనే మరో మూవీలోనూ..
అనన్య పాండే ప్రస్తుతం లైగర్ మూవీలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. పూరీ జగన్నాథ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. అలాగే గెహ్రాయియా అనే మరో మూవీలోనూ నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె ఎక్కువగా పాల్గొంటోంది. ఈ మూవీని అమెజాన్‌లో ఫిబ్రవరి 11వ తేదీన నేరుగా విడుదల చేయనున్నారు.
గెహ్రాయియా అనే మూవీ ప్రమోషన్స్ కోసం అనన్య పాండే ఈ మధ్య కాలంలో ఫోటోషూట్స్ బాగా చేస్తోంది. వాటిల్లో అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఈమె తన అందమైన కాళ్లను చూపిస్తూ ఫోటోషూట్ చేసింది. అది మరిచిపోకముందే మళ్లీ ఎద అందాలను ఆరబోస్తూ ఇంకో ఫోటోషూట్ చేసింది. చూస్తుంటే ఈమె సోషల్ మీడియా ద్వారానే తన సినిమాలకు పబ్లిసిటీ ఎక్కువగా తెచ్చుకుంటుందని అనిపిస్తోంది.
తాజాగా హిందీలో ముగిసిన బిగ్ బాస్ 15 ఫినాలేకు అనన్య పాండే హాజరైంది. గెహ్రాయియా టీమ్ ఈ ఫినాలేలో పాల్గొంది. ఇందులో అనన్య పాండే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ మూవీలో అనన్యతోపాటు దీపికా పదుకొనే కూడా నటించింది. సిద్ధాంత్ చతుర్వేది మరో కీలకపాత్రలో నటించాడు.