Drumstick Leaves : మన చుట్టూ పరిసరాల్లో ఎక్కడ చూసినా మనకు మునగ చెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంటాయి. గ్రామాల్లో మనకు మునక్కాయలు, మునగాకులు విరివిగా లభిస్తాయి. దాదాపుగా కొనాల్సిన పనిలేదు. కానీ పట్టణాలు, నగరాల్లో మాత్రం మనం వీటిని కొనుగోలు చేయాల్సిందే. మునగకాయలను చాలా మంది కూరల్లో వేస్తుంటారు. వీటితో సాంబార్, పప్పు, టమాటా కూర వంటివి చేస్తుంటారు. అయితే వాస్తవానికి మునక్కాయలు మాత్రమే కాదు.. మునగ ఆకులు కూడా మనకు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.
మునగాకులను మనం కూరగా వండుకుని తినవచ్చు. లేదా జ్యూస్ చేసి 30 ఎంఎల్ మోతాదులో వాడుకోవచ్చు. అలాగే ఆకులను ఎండబెట్టి పొడి చేసి రోజూ 1 టీస్పూన్ మోతాదులో నీటిలో కలిపి కూడా తీసుకోవచ్చు. లేదా మునగాకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఒక కప్పు మోతాదులో తాగవచ్చు. ఇలా మునగాకులను ఎలా అయినా తీసుకోవచ్చు. అలాగే వీటితో రోటీ కూడా చేసి తినవచ్చు. ఇలా మునగాకులను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకుల్లో అనేక రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి. అందువల్ల వీటిని పోషకాల గనిగా చెప్పవచ్చు. ఈ ఆకుల్లో విటమిన్లు ఎ, బి1, బి2, బి6, సి ఇంకా ఫొలేట్ ఉంటాయి. అలాగే మెగ్నిషియం, కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్ఫరస్ కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవన్నీ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వ్యాధులను తగ్గించేందుకు సహాయ పడతాయి. మునగాకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపులు సులభంగా తగ్గుతాయి. ఇందుకు గాను మునగాకులను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
మునగాకులను తినడం వల్ల క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే పలు రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. మునగాకుల్లో విటమిన్ సి, బీటా కెరోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. అందువల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ ఆకుల్లో క్వర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. అందువల్ల మునగాకులు హైబీపీ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ ఆకుల్లో క్లోరోజెనిక్ యాసిడ్ అనే ఇంకో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కనుక షుగర్ ఉన్నవారు రోజూ మునగాకులను తీసుకుంటే మేలు జరుగుతుంది.
ఈ ఆకులను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆకులను తీసుకోవడం వల్ల అనేక రకాల జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, మలబద్దకం, గ్యాస్, అల్సర్లు వంటివి తగ్గుతాయి. ఈ ఆకుల్లో కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
మునగాకుల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాంతివంతంగా మారుస్తాయి. జుట్టును సంరక్షిస్తాయి. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. అలాగే చుండ్రు తగ్గుతుంది. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. ఇలా మునగాకులతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని తీసుకోవడం మరిచిపోకండి.
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…