Allu Arjun : మల్టీ స్టారర్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో క్రేజీ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీ స్టారర్ చిత్రం విడుదలకి సిద్ధం కాగా, దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు సెట్స్‌పై పలు మల్టీ స్టారర్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే తాజగా బన్నీతోపాటు బాలీవుడ్ హీరో కాంబినేషన్‌లో ఓ బడా మల్టీ స్టారర్ రూపొందనుందనే వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.
ఇటీవల జెర్సీ హిందీ ట్రైలర్ లాంచ్ కాగా, ఈ కార్యక్రమానికి ప్రధాన తారలు షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్ తదితరులు హాజరయ్యారు. ఊహించని విధంగా ఈ చిత్ర బృందానికి ఆసక్తికర ప్రశ్నలు వేశారు. అల్లు అరవింద్ ని బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తో పాన్ ఇండియా మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నారా? అని మీడియా ప్రశ్నించింది.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నా మనసులో ఆలోచన రాలేదని నేను చెప్పను, ప్రణాళికలు ఉన్నాయి. ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ వాటి గురించి మాట్లాడటానికి ఇది సరైన స్థలం లేదా వేదిక కాదు. సమయం వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తాము” అని అన్నారు. ఆయన మాటల తర్వాత ‘జెర్సీ’ హీరో షాహిద్ కపూర్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో అరవింద్ ఓ మల్టీ స్టారర్ చేయబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…