Aditi Rao Hydari : తెలుగులో పెద్ద సక్సెస్ చిత్రాలు లేకున్నప్పటికీ నటి అదితి రావు హైదరికి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. సమ్మోహనం మూవీ ఒక్కటే ఆమె ఖాతాలో హిట్ చిత్రంగా నిలిచింది. తరువాత ఏ సినిమాలూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఈమె తాజాగా నటించిన మహా సముద్రం మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహా సముద్రం మూవీలో అదితి.. మహా పాత్రలో నటించింది. ఈ సందర్బంగా ప్రీ రిలీజ్ వేడుకలను కూడా ఇటీవల గ్రాండ్‌గా నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఈ బ్యూటీ తన మనస్సులోని మాటను బయట పెట్టింది. తన తల్లి స్వస్థలం వనపర్తి అని, తాను సగం తెలుగు అమ్మాయినని.. కనుక తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలనుందని కూడా తెలియజేసింది.
అయితే బాలీవుడ్‌లో చేసినట్లు తెలుగు సినిమాల్లో స్కిన్ షో చేయనని ఈ అమ్మడు నిర్మాతలకు చెప్పిందట. కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేదే లేదని అంటున్నట్లు తెలుస్తోంది. ఈమె కన్నా క్రేజ్ ఎక్కువ ఉన్న కొత్త హీరోయిన్లకు ఒక్కో సినిమాకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు ఇస్తున్నారు. కానీ అదితి మాత్రం ఒక్క సినిమాకు ఏకంగా రూ.1 కోటి వరకు డిమాండ్ చేస్తుందని తెలిసింది.
అయినప్పటికీ అదితిని తమ సినిమాల్లో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారట. అందుకనే ఈమె అంత మొత్తం డిమాండ్ చేస్తుందని తెలిసింది. మరి ఈమె టాలీవుడ్‌లో సక్సెస్ బాటలో నడుస్తుందా, లేదా.. అన్నది చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…