Actress Pragathi : త‌న‌తో రోజంతా గ‌డిపితే ఆ హీరో అవ‌కాశం ఇస్తాన‌న్నాడు.. న‌టి ప్ర‌గ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

February 4, 2022 10:02 AM

Actress Pragathi : క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న న‌టి ప్ర‌గ‌తి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఫిట్‌నెస్ ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకునే ఈమె.. ఎప్పుడూ ఏదో ఒక వ్యాయామం చేస్తూ క‌నిపిస్తుంటుంది. అలాగే ప‌లు సినిమాల్లోని హిట్ చిత్రాల‌కు త‌న‌దైన శైలిలో డ్యాన్స్‌లు చేస్తూ అల‌రిస్తుంటుంది. ఆ వీడియోల‌ను త‌న సోష‌ల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటుంది.

Actress Pragathi sensational comments about on a hero
Actress Pragathi

ఇక న‌టి ప్ర‌గ‌తి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండ‌స్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట పెట్టింది. తాను కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాన‌ని, ద‌ర్శ‌క నిర్మాత‌లు మాత్ర‌మే కాకుండా.. ఓ హీరో కూడా త‌న‌తో రోజంతా గ‌డిపితే త‌న సినిమాలో అవ‌కాశం ఇప్పిస్తాన‌ని అన్నాడ‌ని.. ఆ పాత విష‌యాల‌ను ఆమె గుర్తు చేసుకుంది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

ఇక ప్ర‌గ‌తి ప‌లు వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ ఎంతో బిజీగా ఉంది. ఈమె న‌టించిన ఎఫ్ 3 చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఎఫ్2 క‌న్నా మించిన కామెడీ ఇందులో ఉంటుంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment