Actress Laya : తెలుగు సినీ ప్రేక్షకులకు సినీ నటి లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. భద్రం కొడుకో అనే మూవీ ద్వారా 1992లో సినీ తెరకు పరిచయం అయింది. తరువాత స్వయంవరం సినిమాతో ఈమెకు బాగా పేరు వచ్చింది. దీంతో ఆఫర్లు తలుపు తట్టాయి. ఆ తరువాత మనోహరం, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, పెళ్లాంతో పనేంటి, మిస్సమ్మ వంటి చిత్రాల్లో నటించింది. ఇవన్నీ ఈమెకు మంచి హిట్స్‌ను అందించాయి. అయితే 2006లో ఈమె పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఈమె భర్తతో కలసి అమెరికాలోనే ఉంటోంది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం లయ ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. పలు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ అలరిస్తోంది. గతంలో సర్కారు వారి పాట మూవీలోని కళావతి పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. ఇక తాజాగా మళ్లీ సంప్రదాయబద్దమైన డ్యాన్స్ చేసి అలరించింది. లయ చేసిన డ్యాన్స్ ఎంతో అద్భుతంగా ఉండడం విశేషం. ఈమె స్వతహాగా నృత్యకారిణి. కనుక సంప్రదాయ నాట్యం చేయడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. అందులో భాగంగానే తాజాగా ఈమె ఓ పాటకు నాట్యం చేసి అలరించింది. ఆ వీడియోను ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది.
ఇక తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మళయాళం భాషలకు చెందిన చిత్రాల్లోనూ నటించింది. ఈమె చివరి సారిగా 2018లో రవితేజ సినిమా అమర్ అక్బర్ ఆంథోనిలో నటించింది. హీరోయిన్ కు తల్లి పాత్ర చేసింది. విజయవాడకు చెందిన ఈమె తెలుగు హీరోయిన్‌గా ఎంతో మంచి గుర్తింపు సాధించింది. కూచిపూడి డ్యాన్స్ చేయడంలో లయ దిట్ట అని చెప్పవచ్చు. ఈమె మనోహరం, ప్రేమించు చిత్రాలకు ఉత్తమ నటిగా వరుసగా రెండు నంది అవార్డులను కూడా సాధించింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…