Bhishma : నేటి ఆధునిక సమాజంలో స్త్రీలకు గౌరవం సరిగ్గా లభించడం లేదనే చెప్పవచ్చు. కానీ ఒకప్పుడు అలా కాదు. ఒకప్పుడు.. అంటే.. ఈ కలియుగానికి ముందు.. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో స్త్రీలకు సమాజంలో రక్షణ ఉండేది. వారిని ఆది పరాశక్తిగా కొలిచేవారు. సీత, ద్రౌపది, పార్వతి, సతి వంటి ఎంతో మంది పతివ్రతలు ఉండేవారు. ఈ క్రమంలోనే కురు వంశ సార్వభౌముడు అయిన భీష్ముడు అంపశయ్యపై పడుకున్నప్పుడు స్త్రీలకు సంబంధించిన పలు విషయాలను పాండవులు, కౌరవులకు చెప్పాడు. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.
స్త్రీలకు సంబంధించి భీష్ముడు చెప్పిన పలు ముఖ్యమైన విషయాలు ఇవే..
1. ఏ కుటుంబంలో ఉండే స్త్రీలను అయినా ఆ కుటుంబ సభ్యులు కచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆమె వల్లే ఆ కుటుంబానికి మంచి పేరు అయినా, చెడ్డ పేరు అయినా వస్తుంది. కనుక ఆమె తెచ్చే పేరుకు కుటుంబమే బాధ్యత వహించాలి.
2. ఏ కుటుంబంలో ఉండే స్త్రీలను అయినా ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. స్త్రీలు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. తద్వారా సమాజం బాగుంటుంది.
3. ఏ కుటుంబంలో అయితే స్త్రీ సంతోషంగా ఉండదో వారికి కష్టాలే ఉంటాయి. అన్నీ నష్టాలే కలుగుతాయి.
4. సమాజంలో ఉన్న ఇతర స్త్రీలను కూడా కచ్చితంగా గౌరవించాలి. లేదంటే వారి వల్ల కష్టాలు కలుగుతాయి. ఒక స్త్రీ మనకు ఏమీ కాకపోయినా ఆమెకు రక్షణగా ఉండాలి.
5. మహిళలకు వ్యతిరేకంగా పురుషులు ఏమీ చేయరాదు. మహిళలు శాపం పెడితే పురుషులు ఇబ్బందులు పడతారు.
6. గర్భంతో ఉన్న స్త్రీలు, పేద కుటుంబానికి చెందిన స్త్రీలకు ఇంకా ఎక్కువ మర్యాద ఇవ్వాలి. వారికి ఇబ్బందులు కలిగించకూడదు.
7. స్త్రీ గౌరవించబడని సమాజం నాశనమవుతుంది. స్త్రీలకు కచ్చితంగా గౌరవం ఇవ్వాలి. అందుకు రామాయణమే ఉదాహరణ.
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…