Dishti Remedy : పురాతన కాలం నుంచి మన పెద్దలు, మనం నమ్ముతూ వస్తున్న ఆచారాల్లో దిష్టి కూడా ఒకటి. దీన్నే దృష్టి అని కూడా అంటారు. నరుడి దిష్టికి నాపరాళ్లు కూడా పగులుతాయి అనే సామెతను మీరు వినే ఉంటారు. అంటే నరుడి చూపు వల్ల కలిగే ప్రభావానికి పెద్ద రాయి కూడా పగులుతుందని అర్థం. అందుకే ఆ మాట చెబుతారు. అయితే ఈ కాలంలో కూడా దిష్టిని నమ్ముతున్నారా ? అంటే.. అవును, దాన్ని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారి కోసమే కింద ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. దీంతో నర దిష్టి నుంచి ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!
నర దిష్టి నుంచి తప్పించుకునేందుకు ఒక సులభమైన మార్గం ఉంది. అదే గణపతి గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని రోజులో ఒకేసారి జపించాలి. జపించినప్పుడు 108 సార్లు పూర్తి చేయాలి. దీంతో దిష్టి ప్రభావం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. మరి ఆ మంత్రం ఏమిటంటే..
“ఓం తత్పురుషాయ విఘ్నహే.. వక్రతుండాయ ధీమహి.. తన్నోన్ గణపతి ప్రచోదయాత్..”
పైన చెప్పిన మంత్రాన్ని రోజులో 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే దిష్టి నుంచి తప్పించుకోవచ్చు. ఇక ఈ మంత్రంతోపాటు కనుదిష్టి యంత్రాన్ని ఇళ్లలో, దుకాణాల్లో, కార్యాలయాల్లోని గోడపై ఉత్తర దిశ చూసే విధంగా ఉంచుకోవాలి. పూజ గదిలో కానీ, ఇంటికి వచ్చే వారి దృష్టి ఆకర్షించే విధంగా ముఖ ద్వారంపైగానీ అలంకరించుకోవచ్చు. ఈ యంత్రానికి ప్రతి అమావాస్య, పౌర్ణమిలకు దిష్టి తీసి దీన్ని పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. కనుక పైన చెప్పిన మంత్రం, తరువాత చెప్పిన సూచనలతో ఎవరైనా దిష్టి బారిన పడకుండా ఉండవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…