lifestyle

IQ : మ‌నిషికి ఉండే తెలివితేట‌ల‌ను ఎలా కొలుస్తారు..? ఒక మ‌నిషికి ఎంత తెలివి ఉంది.. అని ఎలా తెలుసుకోవ‌చ్చు..?

IQ : సాధారణంగా మనం పాలు, నీళ్లు ఇతర ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తాం. అదే ఘన పదార్థాలైతే కేజీల లెక్కన కొలుస్తాం. ఇక వాయువులైతే క్యుబిక్ మీటర్లు, సెంటీమీటర్లు, ఫీట్లలో కొలుస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే మరి ఒక మనిషికి ఉన్న తెలివితేటలను కొలవాలంటే.. అందుకు ఏ కొలమానం వాడుతాం..? ఏంటీ.. తెలివితేటలను ఎవరైనా కొలుస్తారా..? ఎవరికైనా ఉండే తెలివిని కేజీలు, లీటర్ల లెక్కన కొలవడం సాధ్యమవుతుందా..? అని మీరు సందేహించవచ్చు. కానీ తెలివితేటలను కొలవవచ్చు. అయితే అది కేజీలు, లీటర్లలోకాదు.. వేరే పద్ధతిలో.. అదెలాగంటే..

ఎవరైనా ఒక వ్యక్తికి తెలివితేటలు ఎంత ఉన్నాయి.. అని మనకు తెలియజేసే సాధనం ఐక్యూ. దీన్నే ఇంటెలిజెన్స్ కోషెంట్ (Intelligence Quotient) అంటారు. అంటే ఐక్యూ సంఖ్య ఎంత పెద్దదైతే వారికి అన్ని ఎక్కువ తెలివితేటలు ఉంటాయన్నమాట. తెలివితేటలకు కొలమానమే ఐక్యూ. ఒక మనిషికి ఉండే ఐక్యూని బట్టి అతని తెలివితేటలను నిర్దారిస్తారు. అయితే ఐక్యూను ఎలా కొలుస్తారు..? అంటే..

IQ

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఐక్యూని కొలిచేందుకు రక రకాల పద్ధతులు వాడుతున్నారు. వాటిల్లో ముఖ్యమైంది వెక్స్లర్ టెస్టు. ఇందులో మనిషి శబ్ద గ్రహణ శక్తి, జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి, జ్ఞాపకశక్తి, ప్రాసెసింగ్ స్పీడ్ (ఒక ప్రశ్నకు ఎంత వేగంగా సమాధానం చెప్పగలరనే శక్తి) తదితర అన్ని పరిజ్ఞానాలను కొలుస్తారు. వాటిల్లో సాధించే స్కోరును బట్టి చివరకు ఐక్యూని నిర్ణయిస్తారు. అయితే స్టాన్ఫర్డ్ బినెట్ స్కేల్ అనే మరో ఐక్యూ టెస్ట్ కూడా ఉంది. ఇందులో దృశ్య ప్రాదేశిక ప్రాసెసింగ్ వంటి నూతన అంశాల్లో కూడా ఐక్యూను కొలుస్తారు.

సాధారణంగా ఐక్యూ టెస్టులో ఒక వ్యక్తికి ఉండే గణిత శాస్త్ర సామర్థ్యం, పదజాలం ప్రతిభ వంటి అంశాలకు చెందిన ప్రశ్నలను ఇస్తారు. వాటిని ఆ వ్యక్తులు నిర్ణీత కాలంలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇవే కాకుండా పలు ఇతర ఐక్యూ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏవీ కచ్చితమైన ఫలితాలను ఇస్తాయన్న గ్యారంటీ లేదు. అందుకనే ఐక్యూ టెస్టులకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కాకపోతే పలు మానసిక వ్యాధులతో బాధపడేవారి ఐక్యూ ఎంత ఉంది అని తెలుసుకునేందుకు ఈ టెస్టులు ఉపయోగపడతాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో వారి స్థితిని అంచనా వేసి తగిన విధంగా చికిత్స చేసేందుకు వీలు కలుగుతుందని వారు అంటున్నారు.

అయితే ప్రముఖ సైంటిస్టు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఐక్యూ 160 ఉంటుందనే ఒక వాదన బలంగా ప్రచారంలో ఉంది. నిజానికి ఐన్‌స్టీన్ కాలంలో ఐక్యూను కొలిచే పద్ధతులు అప్పటికి ఇంకా అందుబాటులోకి రాలేదు. మరలాంటప్పుడు ఆయన ఐక్యూ 160 ఎలా ఉంటుంది..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ఐక్యూ అనేది నిజంగానే ఒక వ్యక్తి తెలివితేటలను కచ్చితంగా తెలియజేస్తుందని చాలా మంది నమ్మకం. అయితే ఐక్యూ వల్ల తెలివిలేని వారిని చిన్న చూపు చూస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఈ విషయంపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సిందేనని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ఐక్యూ వల్ల ఒక మనిషికి ఉన్న తెలివితేటలను అంచనా వేయడం అంత సులభమేమీ కాదని మెజారిటీ సైంటిస్టుల అభిప్రాయం. ఇదీ.. ఐక్యూ కథాకమామీషు..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM