Watermelon Strawberry Smoothie : పుచ్చకాయలు, స్ట్రాబెర్రీలతో స్మూతీ తయారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. ఉత్సాహం లభిస్తుంది..!
స్ట్రాబెర్రీలు, పుచ్చకాయలు.. మన శరీరానికి చలువ చేస్తాయి. అంతేకాదు, ఈ రెండు పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఈ రెండింటితో స్మూతీ తయారు చేసుకుని సేవిస్తే.. శరీరానికి కొత్త శక్తి, ఉత్సాహం, ఉత్తేజం వస్తాయి. శరీరం చల్లగా కూడా ఉంటుంది. మరింకెందుకాలస్యం వాటర్‌మిలన్, స్ట్రాబెర్రీ స్మూతీని తయారు చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!
స్ట్రాబెర్రీలు – 100 గ్రాములు, తేనె – 1 టేబుల్ స్పూన్, పెరుగు – 150 గ్రాములు, పుచ్చకాయ ముక్కలు – 50 గ్రాములు, చియా సీడ్స్ (టాపింగ్ కోసం) – 1/4 కప్పు.
పైన చెప్పిన అన్ని పదార్థాలను కలిపి బ్లెండర్‌లో వేసి మిశ్రమంగా పట్టుకోవాలి. స్మూతీ తయారవుతుంది. దాన్ని ఒక గ్లాస్‌లో పోయాలి. అనంతరం పైన చియా సీడ్స్ ను టాపింగ్ వేయాలి. తాగేటప్పుడు చియా సీడ్స్‌ను కలుపుకుని తాగాలి. ఇలా ఎంతో రుచిగా ఉండే వాటర్ మిలన్, స్ట్రాబెర్రీ స్మూతీని తయారు చేసి తాగవచ్చు. ఇది ఎంతో ఆరోగ్యకరమైన పానీయం. వేడి శరీరం ఉన్నవారు తాగితే మేలు జరుగుతుంది. అలాగే శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…