Masala Egg Fry : కోడిగుడ్లతో చేసే ఏ వంటకాన్నయినా చాలా మంది ఇష్టంగానే తింటారు. కోడిగుడ్లతో మనం అనేక రకాల వంటలను చేసుకుని తినవచ్చు. వాటిల్లో ఒకటి మసాలా ఎగ్ ఫ్రై. కోడిగుడ్లను ఉడకబెట్టి, మసాలా వేసి వండుకుని తింటే వచ్చే మజాయే వేరు. మరి మసాలా ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో, తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఉడకబెట్టిన కోడి గుడ్లు – 4, ఉల్లిపాయలు – 1 కప్పు, టమాటాలు – 1 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ – 1 కప్పు, పచ్చిమిర్చి – 5, కారం – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తగినంత.
టమాటాలు, వెల్లుల్లి రెబ్బలను తీసుకుని కట్ చేసి వాటిలో నీరు పోసి వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. పాత్రలో నూనె పోసి వేడి చేసి అందులో సన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. అనంతరం ముందుగా పట్టుకున్న టమాటా, వెల్లుల్లి పేస్ట్‌ను వేయాలి. వాసన పోయే వరకు మిశ్రమాన్ని ఫ్రై చేయాలి.
అనంతరం అందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి ఫ్రై చేయాలి. మొత్తం మిశ్రమం బాగా ఫ్రై అయ్యాక అందులో ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను వేసి మళ్లీ ఫ్రై చేయాలి. తరువాత ఉప్పు వేసి, చివరిగా కొత్తిమీర తరుగును అలంకరించాలి. దీంతో ఘుమ ఘుమలాడే మసాలా ఎగ్ ఫ్రై తయారవుతుంది. దీన్ని చపాతీలు లేదా అన్నంతో తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…