Watermelon Strawberry Smoothie : పుచ్చ‌కాయ‌లు, స్ట్రాబెర్రీల‌తో ఎంతో రుచిగా ఉండే స్మూతీ.. త‌యారీ ఇలా..!

January 13, 2024 3:25 PM

Watermelon Strawberry Smoothie : పుచ్చ‌కాయ‌లు, స్ట్రాబెర్రీల‌తో స్మూతీ త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. ఉత్సాహం ల‌భిస్తుంది..!
స్ట్రాబెర్రీలు, పుచ్చ‌కాయ‌లు.. మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తాయి. అంతేకాదు, ఈ రెండు పండ్ల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటితో స్మూతీ త‌యారు చేసుకుని సేవిస్తే.. శరీరానికి కొత్త శ‌క్తి, ఉత్సాహం, ఉత్తేజం వ‌స్తాయి. శ‌రీరం చ‌ల్ల‌గా కూడా ఉంటుంది. మ‌రింకెందుకాల‌స్యం వాట‌ర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీని త‌యారు చేయ‌డం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!

వాట‌ర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స్ట్రాబెర్రీలు – 100 గ్రాములు, తేనె – 1 టేబుల్ స్పూన్, పెరుగు – 150 గ్రాములు, పుచ్చ‌కాయ ముక్క‌లు – 50 గ్రాములు, చియా సీడ్స్ (టాపింగ్ కోసం) – 1/4 క‌ప్పు.

Watermelon Strawberry Smoothie tasty drink recipe
Watermelon Strawberry Smoothie

వాట‌ర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీ త‌యారు చేసే విధానం..

పైన చెప్పిన అన్ని ప‌దార్థాల‌ను క‌లిపి బ్లెండ‌ర్‌లో వేసి మిశ్ర‌మంగా ప‌ట్టుకోవాలి. స్మూతీ త‌యారవుతుంది. దాన్ని ఒక గ్లాస్‌లో పోయాలి. అనంత‌రం పైన చియా సీడ్స్ ను టాపింగ్ వేయాలి. తాగేట‌ప్పుడు చియా సీడ్స్‌ను క‌లుపుకుని తాగాలి. ఇలా ఎంతో రుచిగా ఉండే వాట‌ర్ మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీని త‌యారు చేసి తాగ‌వ‌చ్చు. ఇది ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన పానీయం. వేడి శ‌రీరం ఉన్న‌వారు తాగితే మేలు జ‌రుగుతుంది. అలాగే శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now