Vitamin K Benefits : మన శరీరానికి నిత్యం అవసరం అయ్యే అనేక పోషకాల్లో విటమిన్ కె కూడా ఒకటి. చాలా మందికి ఈ విటమిన్ గురించి తెలియదు. సాధారణంగా విటమిన్లు అనగానే ఎ, బి, సి, డి అనే అనుకుంటారు. కానీ విటమిన్ కె కూడా ఉంటుంది. అది మన శరీరానికి అవసరమే. అయితే విటమిన్ కె మనకు ఎలా సహాయ పడుతుంది, విటమిన్ కె ఏయే పదార్థాల్లో ఉంటుంది, అది లోపిస్తే మనకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ కె మన శరీరంలో రక్తం గడ్డ కట్టేందుకు ఉపయోగపడుతుంది. మనకు గాయాలైనప్పుడు రక్తం ఎక్కువగా పోకుండా ఉండేందుకు గాను గాయంపై రక్తం గడ్డకడుతుంది కదా.. అందుకు గాను విటమిన్ కె మనకు కావాలి. అలాగే ఎముకలు దృఢంగా ఉండడానికి, ఎముకలు నిర్మాణమయ్యేందుకు, గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు.. మనం విటమిన్ కె ఉన్న పదార్థాలను నిత్యం తీసుకోవాలి.
ఇక విటమిన్ కె మనకు పాలకూర, వాల్‌నట్స్, బ్రొకొలి, అవకాడోలు, బాదంపప్పు, బ్రెజిల్ నట్స్, ఎర్ర పప్పు, యాప్రికాట్స్.. తదితర ఆహార పదార్థాల్లో లభిస్తుంది. అయితే విటమిన్ కె ఉన్న ఆహారాలను మనం నిత్యం తీసుకోకపోతే మన శరీరంలో ఆ విటమిన్ లోపం ఏర్పడుతుంది. దీంతో మనకు మన శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే..
విటమిన్ కె లోపిస్తే మన చర్మం ఊరికే కందిపోయినట్లు, నల్లగా మారుతుంది. అలాగే చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిన్న గాయం అయినా బాగా రక్తస్రావం అవడం, రక్తం బాగా పోవడం, స్త్రీలకు రుతు సమయంలో తీవ్ర రక్త స్రావం అవడం, మూత్రం లేదా మలంలో రక్తం పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. వైద్య పరీక్షలు చేయించుకుని ఒక వేళ విటమిన్ కె లోపమని తేలితే అందుకు తగిన విధంగా డాక్టర్ సూచన మేరకు మందులు వాడుకోవాలి. అలాగే పైన చెప్పిన ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా విటమిన్ కె లోపం రాకుండా చూసుకోవచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…