lifestyle

Ulli Mamidi Pachadi : ఉల్లి మామిడి ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Ulli Mamidi Pachadi : వేస‌వికాలంలో ల‌భించే ప‌చ‌క్చి మామిడికాయ‌ల‌ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మామిడికాయ‌ల‌తో చేసే వంట‌కాలు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. అలాగే ప‌చ్చి మామిడికాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ప‌చ్చి మామిడికాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఉల్లిపాయ మామిడికాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా ఈ ప‌చ్చ‌డిని తయారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ మామిడికాయ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయ మామిడికాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీ నూనె – 2 టీ స్పూన్స్, ప‌ల్లీలు – గుప్పెడు, మెంతి గింజ‌లు – 10, ఎండుమిర్చి – 15 నుండి 20, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, పుల్లటి మామిడికాయ – 1, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెమ్మ‌లు – 5, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ఉల్లిపాయలు – 2.

Ulli Mamidi Pachadi

ఉల్లిపాయ మామిడికాయ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌ల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత మెంతి గింజ‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ధనియాలు, జీల‌క‌ర్ర‌, ఆవాలు వేసి వేయించాలి. వీటిని మాడిపోకుండా వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత మామిడికాయ‌పై ఉండే చెక్కును తీసేసి తురుముకోవాలి. త‌రువాత జార్ లో ముందుగా వేయించిన దినుసులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వెల్లుల్లి రెమ్మ‌లు వేసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత మామిడికాయ తురుము, ఉల్లిపాయ ముక్క‌లు వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈ ప‌చ్చ‌డికి తాళింపు వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ మామిడికాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ప‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM