lifestyle

Cashew Paneer Curry : జీడిప‌ప్పు, ప‌నీర్ కూర‌ను ధాబా రుచితో ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Cashew Paneer Curry : మ‌న‌కు రోడ్డు ప‌క్క‌న ధాబాల‌ల్లో ల‌భించే వంట‌కాల్లో కాజు ప‌నీర్ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, నాన్ వంటి వాటితో దీనిని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. ఈ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా రుచిగా ఇంట్లోనే త‌యారు చేసి తీసుకోవచ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా చాలా సుల‌భంగా ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లోనే ధ‌బా స్టైల్ కాజు పనీర్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకికావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ధాబా స్టైల్ కాజు ప‌నీర్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌నీర్- 200గ్రా., త‌రిగిన ట‌మాటాలు – 3, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – పెద్దది ఒక‌టి, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 3 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర – కొద్దిగా, క‌సూరిమెంతి – అర టీ స్పూన్.

Cashew Paneer Curry

మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, ల‌వంగాలు – 3, యాల‌కులు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌.

ధాబా స్టైల్ కాజు ప‌నీర్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన దినుసులు, ట‌మాట‌ముక్క‌లు వేసి క‌ల‌పాలి. టమాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీడిప‌ప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ప‌నీర్ ముక్క‌లు వేసి కొద్దిగా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని క‌లుపుతూ నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. మ‌సాలా పేస్ట్ వేగి నూనె పైకి తేలిన త‌రువాత వేయించిన ప‌నీర్ వేసిక‌ల‌పాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత వేయించిన జీడిప‌ప్పు, కొత్తిమీర, క‌సూరిమెంతి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాజు ప‌నీర్ క‌ర్రీ త‌యార‌వుతుంది. రోటీ, చ‌పాతీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ విధంగా చాలా సుల‌భంగా ఇంట్లోనే ధాబా స్టైల్ లో కాజు ప‌నీర్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM