Young Skin : వయస్సు మీద పడుతుందంటే చాలు.. ఎవరికైనా సరే.. సహజంగానే చర్మం ముడతలు పడుతుంటుంది. దీంతో కొందరు దిగులు చెందుతుంటారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎవరికైనా సరే.. చర్మం ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. అయినప్పటికీ కొందరికి మాత్రం అలా ఉండడం నచ్చదు. చర్మం ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుకోవచ్చు. అలాగే చర్మంపై ముడతలు కూడా పడకుండా ఉంటాయి. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉండేలా చూస్తాయి. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. నిత్యం పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలు రాకుండా చర్మాన్ని ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచుకోవచ్చు. బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మంపై ముడతలు ఏర్పడకుండా చూస్తుంది. నిత్యం బాదంపప్పులను తినడం లేదా బాదంనూనెను వాడడం ద్వారా చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. దీంతో చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి.
బొప్పాయి పండ్లు మన చర్మానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో ఉండే పొటాషియం చర్మాన్ని ఎప్పుడూ మృదువుగా ఉంచుతుంది. చర్మంలో తేమను పెంచుతుంది. దీంతో చర్మం ఎండిపోకుండా ఉంటుంది. అలాగే బొప్పాయి పండును మాస్క్‌లా వేసుకుంటే చర్మం సురక్షితంగా ఉంటుంది. బొప్పాయి పండును నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి. ఎరుపు క్యాప్సికంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఈ క్యాప్సికాన్ని నిత్యం తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి. దీంతో ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
టమాటాల్లో ఉండే లైకోపీన్ చర్మాన్ని సంరక్షిస్తుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చూస్తుంది. దీంతో చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి. అలాగే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…