Ridge Gourd Plant : ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో, మొక్కల్ని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న ప్లేస్ ఉన్నా కూడా, మొక్కల్ని పెంచుతున్నారు. చాలామంది టెర్రస్ మీద కూడా, మొక్కల్ని పెంచుతున్నారు. నిజానికి మొక్కలు పెంచుకుంటే, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పైగా ఇంట్లో పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు వేసి వాటిని మనం తింటే ఆ ఫీల్ వేరు బయట కొన్న వాటిలో, కెమికల్స్ ఉంటాయి. కానీ, మనం ఇంట్లో స్వయంగా పండించుకున్న వాటిని తీసుకుంటే, సంతృప్తిగా ఉంటుంది. అందుకనే చాలా మంది, ఖాళీ సమయాల్లో ఇళ్లల్లో మొక్కల్ని పెంచుతున్నారు.
కుండీలలో కూడా, మనం పాదులు వంటి వాటిని వేసుకోవచ్చు. కుండీలలో బీరపాదును ఎలా పెంచుకోవచ్చు అనే విషయాన్ని, ఈరోజు మనం తెలుసుకుందాం. ఈజీగా మనం కుండీలోనే బీరపాదు వేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాము. ముందు విత్తనాలు తీసుకోండి. నీళ్ళల్లో వేయండి. విత్తనాలు అన్నీ కూడా మునగాలి. తేలిపోకూడదు. ఒకవేళ తేలినట్లయితే, వాటిని పక్కకి తీసేయండి. కేవలం మునిగిన వాటిని మాత్రమే తీసుకోండి.
మట్టి బాగా తడిగా ఉండాలి. ఎండిపోయి ఉండకూడదు. ఈ మట్టిలో సగం కోకో పిట్, సగం కంపోస్ట్ వేసుకుంటే చాలు. విత్తనం కూడా అసలు డ్రై అవ్వకూడదు. విత్తనాన్ని కూడా తడిపి, ఆ తర్వాత కుండీలో వెయ్యండి. ఎక్కువ నీళ్లు వేస్తే కుళ్ళిపోతుంది. కానీ, విత్తనం ఎండిపోకుండా నీళ్లు స్ప్రే చేస్తూ ఉండండి. కొంచెం వేడి తగిలే ప్రదేశంలోనే ఉంచాలి. ఇలా, చేసిన పది పదిహేను రోజులకి మొలక వస్తుంది. ఇప్పుడు మీరు ఇలా మొక్క వచ్చిన తర్వాత, ఇంకొక దానిలోకి మార్చుకోవచ్చు.
కుండీ నుండి కింద అయినా వేసుకోవచ్చు. మొక్కకి సూర్యకిరణాలు పడేటట్టు ఉంచండి. మొక్క ఎదిగే కొద్ది తీగ వస్తూ ఉంటుంది. కాబట్టి, తీగని మీరు దేనికైనా సపోర్ట్ ఇచ్చి, చుడుతూ వుండండి. పసుపు రంగులో వచ్చిన ఆకుల్ని తొలగించేయాలి. వేప నూనెని స్ప్రే చేస్తూ ఉంటే పురుగులు పట్టవు. అలానే చల్లటి ప్రదేశంలో మొక్క ఉన్నట్లయితే, బేకింగ్ సోడా వేసుకోవచ్చు. అలానే, కాయలు కాస్తుంటే కవర్ ని చుట్టండి. ఇలా, ఈ మొక్కను పెంచితే, బాగా బీరకాయలు కాస్తాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…