Munagaku Podi : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రోగాలు అనేక మందిని చుట్టుముడుతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే ఎలాంటి రోగాలు రాకుండా ఉండేందుకు, రోగాలు వచ్చినా కూడా వెంటనే తగ్గేందుకు గాను ఇప్పుడు చెప్పబోయే ఒక పొడిని తయారు చేసి తినాల్సి ఉంటుంది. దీన్ని అన్నంలో రోజూ మొదటి ముద్దలో తినాలి. దీంతో ఎలాంటి రోగం అయినా సరే వెంటనే తగ్గిపోతుంది. మళ్లీ రోగాలు రాకుండా ఉంటాయి. ఇక ఆ పొడి ఏమిటి, దాన్ని ఎలా తయారు చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకు పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మునగాకు – 4 కప్పులు, శనగపప్పు – ఒక కప్పు, పెసర పప్పు – అర కప్పు, ధనియాలు – 4 టీస్పూన్లు, ఎండు మిర్చి – 12, చింతపండు – కొద్దిగా, బెల్లం – చిన్న ముక్క, జీలకర్ర – 2 టీస్పూన్లు, మెంతులు – 2 టీస్పూన్లు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – తగినంత.
మునగాకు పొడిని తయారు చేసే విధానం..
ముందుగా బాణలిలో శనగపప్పు, పెసర పప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు విడివిడిగా వేయించి తీయాలి. ఇవి చల్లారాక అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత అందులోనే కొద్దిగా నూనె వేసి ఎండు మిర్చి వేసి వేయించి తీసి చింతపండు వేయాలి. ఇది కూడా కాస్త వేయించాక తీసేసి మునగాకు వేయించాలి. ఇప్పుడు మిక్సీలో చింతపండు, ఎండు మిర్చి, మునగాకు, పసుపు, ఉప్పు, బెల్లం కలిపి గ్రైండ్ చేయాలి. తరువాత అందులోనే మళ్లీ ముందుగా చేసి పెట్టుకున్న పప్పుల పొడి వేసి మళ్లీ ఓసారి గ్రైండ్ చేసి తీయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మునగాకు పొడి రెడీ అవుతుంది. దీన్ని రోజూ అన్నంలో మొదటి ముద్దలో తినాలి. మధ్యాహ్నం, రాత్రి ఒక్కోసారి ఒక్కో ముద్ద తింటే చాలు, ఎలాంటి రోగం రాదు. ఉన్న రోగాలు కూడా వెంటనే తగ్గుతాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…