Immunity Foods : రోజుకో రకం రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఏ రోగమైనా మొట్టమొదట రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ)పైనే దాడి చేసి గెలిచి మన శరీరాన్ని ఆక్రమిస్తాయి. ప్రస్తుతం చాలా రకాల వైరస్‌లు, బాక్టీరియాలు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మనల్ని భయపెడుతున్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. అందుకోసం ఏవేవి తీసుకోవాలంటే.. నల్లద్రాక్ష, వేరుశనగలు, పిస్తా, మల్బరీస్, స్ట్రా బెర్రీలను రెగ్యులర్‌గా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే జామకాయలు, బత్తాయి, నారింజ, నిమ్మకాయ, క్యాప్సికమ్‌లను కూడా తినాలి.
కెరోటినాయిడ్ ఉన్న ఆహార పదార్థాలు.. అనగా చిలగడదుంపలు, బొప్పాయి, క్యారెట్ వంటి వాటిని కూడా తీసుకోవాలి. వెల్లుల్లి, అల్లం, పసుపు, మిరియాలు, ఆకుకూరలు ముఖ్యంగా మునగాకు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్, ఇతర వ్యాధుల లక్షణాలు ఉన్నప్పుడు ఈ కింది వంటకం చేసుకుని తీసుకోండి. దీన్ని అన్ని వయస్సుల వారు తినవచ్చు.
పాలు, పసుపు, శొంఠి, మిరియాలు, తులసి, యాలకులు, ఎండు ఖర్జూరాలు.
మూడు ఎండు ఖర్జూరాలను పొడి చేసి అందులో అర టీస్పూన్ పసుపు, చిటికెడు శొంఠి, 10 మిరియాలు, చిటికెడు యాలకుల పొడి వేసి మిశ్రమంగా చేయాలి. ఒక గిన్నెలో ఈ పొడి వేసి కొన్ని నీళ్లు పోసి మరిగించాలి. వేరే గిన్నెలో గ్లాసు పాలు పోసి మరిగించి ఈ పాలల్లో మరిగించిన పొడి వేసి నురుగు వచ్చేట్లు అటు ఇటు గిన్నెల్లోకి మార్చుకుని ఫిల్టర్ చేసి తాగాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…