Whiten Teeth : మన శరీరంలోని అవయవాల్లో దంతాలు కూడా ఒకటి. చాలా మంది వీటి ఆరోగ్యంపై దృష్టి పెట్టరు. దంతాలను సరిగ్గా తోమరు. నోటిని సరిగ్గా శుభ్రం చేయరు. దీంతో నోరు, చిగుళ్లు, దంతాల సమస్యలు వస్తుంటాయి. దీంతో దంతాలపై పాచి, గార పేరుకుపోతుంటాయి. అయితే కింది చిట్కాలను పాటిస్తే దాంతో దంతాలను శుభ్రంగా మార్చుకోవచ్చు. అలాగే దంతాలు తెల్లగా మారి మెరుస్తాయి. వాటిపై ఉండే పాచి, గార తొలగిపోతాయి. ఇక దంతాలను తెల్లగా మెరిసేలా చేసే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల దంతాలు, నోరు, చిగుళ్లు శుభ్రంగా మారుతాయి. ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనెను తీసుకుని నోట్లో పోసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా పుక్కిలించాలి. తరువాత ఉమ్మేయాలి. అనంతరం మీరు రోజూ వాడే టూత్‌పేస్ట్‌తో దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. టూత్‌పేస్ట్ నాచురల్‌ది అయితే ఇంకా మంచిది. ఇలా రోజూ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ దంతాలు మెరుస్తాయి. దంతాలపై ఉండే పాచి, గార పోతాయి. అలాగే చిగుళ్లు, నోరు శుభ్రంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
రోజూ యాపిల్స్, క్యారెట్లు, కీరదోస వంటి పండ్లు లేదా కూరగాయలను తింటుండాలి. ఇవి దంతాలను సహజసిద్ధంగా మెరిసేలా చేస్తాయి. నోటిని శుభ్రం చేస్తాయి. వీటిని తినడం వల్ల దంతాల్లో ఉండే యాసిడ్లు తటస్థం అవుతాయి. దీంతో దంతాలు, చిగుళ్లపై యాసిడ్ల ప్రభావం తగ్గుతుంది. అలాగే దంతాల సందుల్లో ఉండే పాచి, వ్యర్థాలు తొలగిపోతాయి. దంతాలు, చిగుళ్లు శుభ్రంగా ఉంటాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ను కొద్దిగా తీసుకుని నీళ్లతో కలిపి ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. తరువాత బ్రష్ చేసుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే ఫలితం ఉంటుంది. కొద్ది రోజుల్లోనే దంతాలు తెల్లగా మారుతాయి. అలాగే నారింజ పండు లేదా అరటి పండు తొక్కలతో దంతాలను తోముతున్నా కూడా వాటిపై ఉండే పాచి, గార పోతాయి. దంతాలు శుభ్రంగా మారుతాయి. దంతాలు తెల్లగా మిలమిలా మెరుస్తాయి. ఇలా ఈ చిట్కాలను పాటించడం వల్ల దంతాలు, చిగుళ్లు, నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…